Begin typing your search above and press return to search.

శృంగారం ఎక్కువైతే ఆ తిప్పలు తప్పవా?

By:  Tupaki Desk   |   5 Nov 2019 4:56 AM GMT
శృంగారం ఎక్కువైతే ఆ తిప్పలు తప్పవా?
X
ఏదైనా అతి మంచిది కాదని.. మితం చాలా అవసరమని చెబుతుంటారు. శృంగారంతో తేలిపోతూ బతుకుబండిని లాగిస్తే అంతకు మించిన అదృష్టం ఇంకేం ఉంటుందని భావించేటోళ్లు చాలామందే కనిపిస్తారు. ఊహలకు.. వాస్తవాలకు మధ్య ఏ మాత్రం పొసగదని.. సెక్స్ విషయంలో అలాంటివి ఎక్కువేనని చెబుతారు. ఎక్కువసేపు సెక్స్ చేయటం మీద చాలామందికి ఫాంటసీలు ఉంటాయి.

అయితే.. తాజాగా జరిపిన పరిశోధనల్లో తేలిన విషయం తెలిస్తే అవాక్కు కావటం ఖాయం. పరిమితికి మించిన శృంగారంతో తిప్పలు తప్పవని తేల్చారు. అదేపనిగా ఎక్కువసేపు సెక్స్ చేయటం ఒంటికి మంచిది కాదని తేల్చారు. యూకేకు చెందిన శాస్త్రవేత్తలు.. తాము తాజాగా జరిపిన పరిశోధనల్లో శృంగారానికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు.

పరిమితంగా రోజూ సెక్స్ చేయటం కారణంగా మెదడులోని నరాలు యాక్టివ్ అవుతాయని.. అది శరీరానికి మంచి వ్యాయామం అవుతుందని తేల్చారు. అదే సమయంలో రోజూ సెక్స్ అంటే మోతాదుకు మించిదే మాత్రం మొదటికే మోసం ఖాయమంటున్నారు. అతిగా సెక్స్ చేస్తే వెన్నుపూసలకు ఏ మాత్రం మంచిది కాదంటున్నారు. కండరాలు పటుత్వాన్ని కోల్పోయే ప్రమాదం పొంచి ఉందంటున్నారు.

విషయం ఏదైనా సరే అతితో తిప్పలు తప్పవని.. మితానికి మించింది లేదన్న విషయాన్ని శాస్త్రవేత్తలు తమ పరిశోధనలతో మరోసారి తేల్చారని చెబుతున్నారు. సెక్స్ విషయంలో అదే పనిగా చేసే అతి వద్దని హెచ్చరిస్తున్నారు. శృంగారానికి ముందు ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదన్న సలహాను వారిస్తున్నారు.