Begin typing your search above and press return to search.
వ్యాక్సిన్ వచ్చినా మాస్క్ పెట్టుకోవాల్సిందే : ఐసిఎంఆర్ !
By: Tupaki Desk | 30 Nov 2020 2:30 AM GMTకరోనా మహమ్మారి విజృంభణ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారి జీవన శైలిలో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పేస్ మాస్క్ అనేది మనిషి జీవితంలో ఓ భాగమైపోయింది. కరోనా వచ్చిన తర్వాత పేస్ మాస్క్ ఎంతటి ప్రాముఖ్యతను కలిగి ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇదిలా ఉంటే .. కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంది. ఈ తరుణంలో భారత వైద్య పరిశోధన మండలి కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారిని దేశంలో కట్టడి చేయడం కోసం ప్రస్తుతం అమలు చేస్తున్న నిబంధనలు సుదీర్ఘకాలంపాటు కొనసాగుతాయని తెలిపారు.
కరోనా వ్యాక్సిన్ వచ్చినా కూడా ప్రజలు సుదీర్ఘకాలంపాటు మాస్కులు ధరించాల్సి ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. కరోనా వ్యాధి నిర్వహణ మార్పులు అనే అంశంపై కోల్ కతా లోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన వెబినార్ లో ఆయన పాల్గొన్నారు. టీకా రూపకల్పనలో భారత్ అద్భుత ప్రగతి సాధిస్తున్నదని తెలిపారు. వచ్చే ఏడాది జూలై కల్లా దేశంలోని 30 కోట్ల మందికి కరోనా టీకా వేయాలనేది తమ లక్ష్యమని, ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని ప్రొఫెసర్ భార్గవ వెల్లడించారు. మాస్కులు అంటే దుస్తులతో చేసిన టీకా లాంటివని, కరోనా వ్యాప్తిని నిరోధించడంలో మాస్కుల పాత్ర ఎంతో ఉందని ఆయన తెలిపారు. అయితే, కరోనాను అంతం చేయాలంటే టీకా ఒక్కటే సరిపోదని బార్గవ అభిప్రాయపడ్డారు. సామాజిక దూరం పాటించడం, చేతులను తరచూ శుభ్రపర్చుకోవడం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలను ఇకపై కూడా కొనసాగించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.