Begin typing your search above and press return to search.
ఆలోచనల్లో మార్పు రాకుంటే వేటు తప్పదా?
By: Tupaki Desk | 17 Nov 2022 4:30 PM GMTప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు దక్కించుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఒకప్పటితో పోటీస్తే ఇప్పుడున్న ఉద్యోగాల్లో చాలా వరకు అనేక మార్పులొచ్చాయి. కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా కష్టపడే వారి కంటే స్మార్ట్ వర్క్ కే ప్రాధాన్యం ఇస్తున్నాయి. పరిస్థితులు తగ్గట్టుగా రాణించే వారినే ఆయా కంపెనీలు ఓన్ చేసుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఇకపై నేను కంపెనీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్నారని.. దీనిపైనే నా కుటుంబం ఆధారపడి బతుకుతున్నామని చెబితే కుదరదు. ప్రస్తుత ట్రెండ్ తగ్గట్టుగా ఎవరైతే స్మార్ట్ వర్క్ తో పనిని క్షణాల్లో ముగిస్తారో వారికి ఉద్యోగాల్లో ఎలాంటి ఢోకా ఉండదని యజమానులు భరోసా ఇస్తున్నారు. అలా కాకుండా కేవలం కష్టాన్ని నమ్ముకుంటే మాత్రం ఏదో ఒకరోజు ఇంటికి పంపించడం ఖాయమనే సంకేతాలను సైతం ఇస్తున్నాయి.
ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న వారంతా సదరు కంపెనీ తమ నుంచి ఏం కోరుకుంటుందో తెలుసుకొని అందుకు తగ్గట్టుగా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ విషయంలో వెనుకబడుతారో వారిపై ఏ క్షణాన వేటు పడుతుందో తెలియని పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయని ఇటీవల ఒక ప్రముఖ కంపెనీ నిర్వహించిన సర్వేలో ఉద్యోగులు వెల్లడించారు.
మీ పనికి సంబంధించి సరైన స్కిల్స్ మీలో ఉన్నాయా.. మీ జూనియర్లకు మెంటర్ గా ఉంటున్నారా.. కార్యాలయంలో పని చేసేందుకు స్వచ్చంధంగా ముందుకొస్తున్నారా.. పనిలో వచ్చిన సమస్యలకు పరిష్కారం చూపుతున్నారా.. కొత్త టెక్నాలజీ నేర్చుకుంటున్నారా.. మీ బాస్ పని భారాన్ని మీరు పంచుకుంటున్నారా.. తోటి ఉద్యోగులతో పనిపై అభిప్రాయాలు.. సత్సంబంధాలు మెరుగుపర్చుకుంటున్నారా? అనేది మీకు మీరు బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది.
ఈ విషయంలో మీరు ఎక్కడ వెనుకబడి ఉన్నారో తెలుసుకొని అందుకు తగ్గట్టుగా మార్పులు చేసుకోవాలని హెచ్ఆర్ నిపుణులు సూచిస్తున్నారు. కంపెనీకి మనం భారం అవుతున్నామని యజమానులు భావిస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ క్షణాన అయినా వేటు తప్పదని అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న వారంతా కూడా తమ పని తీరును మెరుగు పర్చుకోవడంతోపాటు ఆలోచనల్లో మార్పు తెచ్చుకొని తోటి ఉద్యోగులతో సత్సంబంధాలు కలిగి ఉంటేనే వారికి ఉద్యోగానికి భద్రత ఉంటుందనే మాట విన్పిస్తోంది. ఇందుకోసం ఉద్యోగాలు మరింత శ్రమించాల్సిన అవసరం ఎంతైన ఉందనే వాదనలు విన్పిస్తున్నాయి. లేనట్లయితే భవిష్యత్ లో తిప్పలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.