Begin typing your search above and press return to search.

డీఆర్ ఎస్ లేకుంటే...ఎన్ని ఫ‌లితాలు తిర‌గ‌బ‌డేవో?

By:  Tupaki Desk   |   15 July 2019 10:21 AM GMT
డీఆర్ ఎస్ లేకుంటే...ఎన్ని ఫ‌లితాలు తిర‌గ‌బ‌డేవో?
X
డీఆర్ ఎస్‌... డెసిష‌న్ రెవ్యూ సిస్ట‌మ్ గా పిలిచే ఈ ప‌ద్ద‌తి వ‌ర‌ల్డ్ క్రికెట్ లో అమ‌లులోకి వ‌చ్చాక పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు జ‌రిగాయి. కొంద‌రు దీనిని దునుమాడితే... మరికొంద‌రు దీనిని స్వాగ‌తించారు. క్రికెట్ మ్యాచ్ లో అంపైర్లు తీసుకునే నిర్ణ‌యాల‌పై.. ప్ర‌త్యేకించి అవుట్ ఇస్తూ తీసుకునే నిర్ణ‌యాల‌ను పునఃస‌మీక్షించే విధాన‌మే డీఆర్ ఎస్‌. అంపైర్ తీసుకునే నిర్ణ‌యంపై అనుమానం వ‌స్తే... వెంట‌నే డీఆర్ ఎస్ ను కోరుకునే అవ‌కాశాన్ని ఇరు జ‌ట్ల‌కూ ఉంటుంది. మిస్ట‌ర్ కూల్ మ‌హేంద్ర సింగ్ ధోనీ ఎంత‌గానో కీర్తించే ఈ డీఆర్ ఎస్ విధానం క్రికెట్ లో ఎంత అవ‌స‌ర‌మే నిన్న‌టితో ముగిసిన ఐసీపీ వ‌న్డే వ‌రల్డ్ క‌ప్ సిరీస్ తేల్చి చెప్పింది. డీఆర్ ఎస్ లేకుంటే.. ఎన్ని ఫ‌లితాలు మారిపోయేవోన‌న్న విష‌యాన్ని కూడా ఈ వ‌రల్డ్ క‌ప్ మ‌న క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపింది. అంతేకాకుండా మొత్తం ఈ మెగా టోర్నీ... డీఆర్ ఎస్ భ‌విష్య‌త్తులోనూ కొన‌సాగించాల్సిందేన‌న్న స్ప‌ష్ట‌మైన సంకేతాల‌ను ఇచ్చింద‌నే చెప్పాలి.

స‌రే.. ఈ డీఆర్ ఎస్ అంటే ఏమిటి? ఈ వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఎలా ప‌నిచేసింద‌న్న విష‌యాల్లోకి వెళితే... వ‌ర‌ల్డ్‌ క్రికెట్‌లో డీఆర్‌ ఎస్ ను ప్రవేశపెట్టి ఇప్పటికే చాలా ఏళ్లే అయ్యింది. ఈ విధానంపై కొన్ని అభ్యంతరాలు నేటికీ ఉన్నప్పటికీ దీని వల్ల క్రికెటర్లు అంపైర్ల నిర్ణయాలకు బలయ్యే సందర్భాలు తగ్గాయనే చెప్పాలి. డీఆర్‌ ఎస్‌ లో హాక్‌ ఐ (బాల్‌ ట్రాకింట్‌ టెక్నాలజీ), హాట్‌ స్పాట్‌(బ్యాట్‌ కు బంతి ఎడ్జ్‌ తీసుకుందా అనే కోణాన్ని పరిశీలించడం), స్నికో మీటర్(బంతి బ్యాట్‌ కు లేదా ప్యాడ్‌కు తగిలిందా గుర్తించడానికి వాడే టెక్నాలజీ)లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వీటి సాయంతో అసలు క్రికెటర్‌ ఔటా, కాదా అనే విషయంపై థర్డ్‌ అంపైర్‌ నిర్ణయానికి వచ్చిన తర్వాత ఫీల్డ్‌ అంపైర్‌ కు సూచిస్తాడు. ఆ క్రమంలోనే ఫీల్డ్‌ అంపైర్‌ తన నిర్ణయాన్ని సరి చేసుకునే అవకాశం ఉంది.

నిన్న‌టితో ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో డీఆర్‌ ఎస్‌ ది కూడా ప్రముఖ పాత్రనే చెప్పాలి. నిజంగా డీఆర్‌ ఎస్‌ లేకుంటే మెగా టోర్నీ కూడా పేలవంగా ముగిసే అవకాశంతో పాటు ఎన్నో వివాదాలకు ఆజ్యం పోసేది. ఈ వరల్డ్‌ కప్‌ లో ఫీల్డ్‌ అంపైర్లు ప్రకటించిన నిర్ణయాలు డీఆర్‌ ఎస్‌ లో తప్పుగా తేలిన సందర్భాల్లో చాలానే ఉన్నాయి. ఇలా అత్యధికంగా తప్పుడు నిర్ణయాలు ప్రకటించిన జాబితాలో రిచర్డ్‌ అలన్‌ కెటల్‌ బారో(ఇంగ్లండ్‌ అంపైర్‌) మొదటి స్థానంలో ఉన్నాడు. 2019 వరల్డ్‌ కప్‌ లో రిచర్డ్‌ అలన్‌ ప్రకటించిన ఐదు నిర్ణయాలు డీఆర్‌ ఎస్‌ లో తప్పుగా తేలగా, ఆ తర్వాత వరుసలో క్రిస్టోఫర్‌ గాఫనీ(న్యూజిలాండ్‌ అంపైర్‌), పాల్‌ విల్సన్‌(ఆస్ట్రేలియా అంపైర్‌), రుచిర పలియాగురుజే( శ్రీలంక అంపైర్‌), కుమార ధర్మసేన(శ్రీలంక అంపైర్‌)లు సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. వీరు తలో నాలుగు అంపైరింగ్‌ తప్పిదాలు చేశారు.