Begin typing your search above and press return to search.
కేసీఆర్ లేకపోతే పదవుల్లేవు సరే.. సోనియా మాటేంటి కేటీఆర్?
By: Tupaki Desk | 27 April 2022 10:30 AM GMTఏం జరిగినా ఏ ఒక్కరితో జరిగిపోదు. అలాంటిది ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటం అన్నది ఏ ఒక్కరితోనూ సాధ్యం కాదు. కోట్లాది మంది కదిలి.. వారి ముందు కేసీఆర్ లాంటోడు నిలబడటం ఒక ఎత్తు అయితే.. తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా లెటర్ ఇచ్చిన చంద్రబాబు..దాన్ని పరిగణలోకి తీసుకొని సోనియా గాంధీ పట్టుదలతో వ్యవహరించటంతో పాటు.. అవసరమైన వేళ పార్లమెంటు తలుపులు మూసి.. లైవ్ కట్ చేసి మరీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ఓకే చేయించిన వైనాన్ని ఎవరూ మర్చిపోలేదు. కానీ.. ఇవాల్టి రోజున తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న మంత్రి కేటీఆర్ మాత్రం.. కేసీఆర్ అనే మూడు అక్షరాల శక్తి లేకుపోతే.. టీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఈ రోజున రాష్ట్రంలో మాట్లాడుతున్న వారు ఎవరికైనా పదవులు లేవని వ్యాఖ్యానిస్తున్నారు.
కేటీఆర్ గొప్పతనం ఏమంటే.. ఆయన మాటలు విన్నంతనే నిజమే కదా? అనిపిస్తాయి. కానీ.. లోతుల్లోకి వెళ్లి చూసినప్పుడు మాత్రం ఆ మాటల్లోని డొల్లతనం ఇట్టే కనిపిస్తూ ఉంటుంది. ఆయన మాటల్లో అధికారంలో ఉన్నామన్న అహంకారం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. తన తండ్రి గురించి కేటీఆర్ గొప్పలు చెప్పుకోవటం తప్పు కాదు. ఏ కొడుకుకైనా తండ్రి హీరోగా కనిపిస్తారు. అందునా కేసీఆర్ లాంటి తండ్రిని సూపర్ హీరోగా చెప్పుకోవటం తప్పేం కాదు.
ఆ ప్రయత్నంలో లేని నిజాల్ని ఉన్నట్లుగా.. జరిగిన వాస్తవాల్ని వదిలిపెట్టేసి.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం వల్ల విలువ తగ్గటం తప్పించి మరింకేమీ ఉండదన్న విషయాన్ని మంత్రి కేటీఆర్ మర్చిపోయినట్లుగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో ముగ్గురు చాలా చాలా కీలకంగా వ్యవహరించారని చెప్పాలి. నిజానికి ఆ ముగ్గురు లేకుంటే తెలంగాణ రాష్ట్రం అన్నది ఉండేదే కాదు. ఎవరెంత గింజుకున్నా ఏపీ ఉమ్మడి రాష్ట్రంగానే ఉండేది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమన్న డిమాండ్ ను వాస్తవంలోకి తీసుకెళ్లిన వారిలో అత్యంత కీలకంగా వ్యవహరించిన వారిలో మొదటి వ్యక్తి చంద్రబాబుగా చెప్పాలి. ఆయన పేరు చెప్పినంతనే తెలంగాణవాదులు మొదలుకొని అందరూ తిట్టేస్తారు.
నిజానికి చంద్రబాబు లెటర్ ఇచ్చే వరకు కూడా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎలాంటి నిర్నయాన్ని తీసుకోలేదు. చంద్రబాబు లేఖకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించిన నాటి ఉద్యమ నాయకుడిగా.. ఫైర్ బ్రాండ్ గా ఉన్న హరీశ్ రావు.. తెలంగాణ కోసం బాబు లేఖ ఇస్తే.. తాను టీడీపీ కార్యాలయంలో ఉద్యోగిగా పని చేస్తానని చెప్పటాన్ని మర్చిపోకూడదు.
చంద్రబాబు ఎప్పుడైతే తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చారో.. అప్పటి నుంచే ప్రత్యేక తెలంగాణ డిమాండ్ కు మరింత బలం చేకూరింది. బాబు లెటర్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ కు మరో మార్గం లేకపోయింది. చివరకు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవటం ఒక ఎత్తు అయితే.. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందటంలో బీజేపీ నేత సుష్మా స్వరాజ్ కీలకంగా వ్యవహరించటం.. కాంగ్రెస్ తో సమన్వయం చేసుకోవటంలో ఆమెతో పాటు వెంకయ్యనాయుడు ఇచ్చిన చేయూత తెలంగాణ ప్రాక్టికల్ గా మారింది. ఇంత జరిగిన తర్వాత ఈ రోజున కేటీఆర్ మాత్రం క్రెడిట్ మొత్తం కేసీఆర్ ఖాతాలో వేయటం ఎంతవరకు ధర్మమన్నది ప్రశ్న.