Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ లేదంటూనే.. ఇలా చేస్తున్నారే.. అనేక సందేహాలు!
By: Tupaki Desk | 24 April 2021 3:30 AM GMTఔను! దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దేశంలో ఎక్కడా కరోనా తగ్గిన పరిస్థి తి కనిపించలేదు. పైగా కేసులు, మరణాలు కూడా భారీ ఎత్తున పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. అయినా కూడా ఎక్కడా కేసులు తగ్గుముఖం పట్టలేదు. పైగా మరింత తీవ్రం అవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఈ పరిణామాలు ఇలా సాగుతున్న నేపథ్యంలో.. దేశంలో లాక్‌డౌన్ పెట్టేది లేదని.. కేంద్ర ప్రభుత్వం పదే పదే చెబుతోంది.
ఇక, రాష్ట్రాల్లోనూ కొన్ని కఠిన నిబంధనలు తీసుకుంటూనే.. లాక్‌డౌన్ జోలికి పోకుండా జాగ్రత్త పడుతున్నా రు. దీంతో ఫీల్ గుడ్.. తరహాలో రాష్ట్రాలు ఉన్నాయి. కానీ.. లాక్‌డౌన్ లేదని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు.. అనూహ్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా పేదలను దృష్టిలో పెట్టుకుని వచ్చే రెండు నెలలపాటు.. నిత్యావసరాలను ఉచితంగా పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
కోవిడ్-19 మహమ్మారి విసురుతున్న సవాళ్లతో ఇబ్బందులు అనుభవిస్తున్న పేదలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా రేషన్ సరుకులను అందించబోతోంది. మే, జూన్ నెలల్లో ఉచితంగా ఆహార ధాన్యాలను పేదలకు అందజేయాలని నిర్ణయించింది. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం క్రింద ఆహార ధాన్యాలను ఉచితంగా అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, దేశవ్యాప్తంగా సుమారు 80 కోట్ల మంది లబ్ధిదారులకు ఉచితంగా 5 కేజీల చొప్పున ఆహార ధాన్యాలను అందజేస్తారు.
కోవిడ్-19 మహమ్మారి విలయం నేపథ్యంలో అమలు చేయబోయే ఈ పథకం కోసం సుమారు రూ.26 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్టు తెలిపింది. అయితే.. వాస్తవానికి గత లాక్‌డౌన్ సమయంలో మాత్రమే.. కేంద్రం ఇలా నిర్ణయం తీసుకుంది. కానీ, ఇప్పుడు లాక్‌డౌన్ పరిస్థితి లేనప్పుడు ఎందుకు నిర్ణయం తీసుకుంది? అనేది ప్రశ్న. మరోవైపు.. దేశంలో కరోనా తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌ను ఆక్షేపించింది. సరైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే మోడీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందా? లేక లాక్‌డౌన్ సన్నాహాల్లో భాగంగా ముందస్తు హెచ్చరికగా ఇలా చేస్తోందా? అనేది ఆసక్తిగా మారింది.