Begin typing your search above and press return to search.

విమానాల్లో మాస్క్ లేకపోతే...!

By:  Tupaki Desk   |   17 Dec 2021 4:30 PM GMT
విమానాల్లో మాస్క్ లేకపోతే...!
X
కరోనా వైరస్ రోజు రోజుకు మరింత ప్రమాదకారి గా మారుతుంది. అందుకు తగ్గట్టుగానే ఈ మహమ్మారి నుంచి ఇప్పటికే కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చాయి. ఇదిలా ఉంటే ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన అటువంటి ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రెండు మూడు రోజుల్లోనే కేసుల సంఖ్య అమాంతం పెంచేస్తూ వైద్య అధికారులకు సవాల్ విసురుతుంది. ఇప్పటికే సుమారు 56 దేశాలకు పైగా ఒమిక్రాన్ తో పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరి కొన్ని దేశాలు ఆంక్షల వలయంలోకి వెళ్లి పోయాయి. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో వైరస్ ఆంక్షలను మరింత కఠినతరం చేశాయి అక్కడి ప్రభుత్వాలు. మార్పు ధరించడంతో పాటు భౌతిక దూరాన్ని కూడా పాటించాలని ప్రజలను సూచిస్తున్నాయి. ఈ మేరకు వైరస్ ను అదుపు చేయవచ్చని ప్రణాళికలు రచిస్తున్నాయి.

వైరస్ వ్యాప్తికి అత్యంత అనుకూలంగా ఉండే ప్రధాన రంగమైనా విమానయానం లో ఆంక్షలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు అమెరికా విమానయాన సిబ్బంది. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం గా ఇటీవల ఓ ఘటన చోటు చేసుకుంది. మాస్కులు లేకుండా వచ్చిన ఓ ప్రయాణికుడి షాక్ ఇచ్చింది అమెరికాకు చెందిన ఓ విమాన సంస్థ. కేవలం ఓ ఎర్ర గుడ్డని మూతికి అడ్డంగా ధరించి వచ్చిన ఆ వ్యక్తిని నిర్ధాక్షణ్యంగా విమానం నుంచి కిందకి చేసింది సదరు సంస్థ. కరోనా నియమ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే ఇలాంటి నిర్దాక్షిణ్య చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ప్రతి ఒక్కరికి స్పష్టం చేసింది. విమాన ప్రయాణాల కారణంగానే వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరించింది. దీంతో ఆంక్షలు అమలు విషయంలో కచ్చితంగా వ్యవహరించాలని చూస్తోంది.

ఇటువంటి సమయంలో కూడా విమాన సిబ్బందితో వాదులాడిన వ్యక్తి పేరు ఆడం జెన్నీ. అతనికి 38 సంవత్సరాలు. అయితే ఆడమ్ ఇటీవల అమెరికాలోని లాడర్ డెల్ విమానాశ్రయం నుంచి ప్రయాణించాలని టికెట్ బుక్ చేసుకున్నాడు. బోర్డింగ్ అంతా పూర్తయింది. విమానంలో కూర్చున్నారు. ఆ తర్వాత విమాన సిబ్బంది ప్రతి ఒక్కరూ మాస్కులు పెట్టుకున్నారో లేదో అని చూసేందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆడం కేవలం మూతికి ఒక ఎర్ర గుడ్డను మాత్రమే పెట్టుకుని ఉండటం గమనించారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశారు సిబ్బంది. అతనిని విమానం నుంచి కిందకి దించేయాలనే నిర్ణయించారు. ఇందుకు గల కారణం కూడా సంబంధిత ఎయిర్ లెన్స్ పేర్కొంది. మాస్క్ పెట్టుకోక పోవడమే కాకుండా పదే పదే వాదనకు దిగారు అని వివరించింది. ఆంక్షల విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని సదరు సంస్థ స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే ఆడం చెప్పినా వాదన మరోలా ఉంది. విమాన సిబ్బంది తాను తినేటప్పుడు కూడా మాస్కు ధరించాలని ఒత్తిడి చేసినట్లు పేర్కొన్నారు. ఇది ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. ఆడం మాటలు విన్న విమానాశ్రయ సిబ్బంది ఒక్కసారిగా ఖంగుతిన్నారు. దీనిపై పూర్తి వివరణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తాము ప్రభుత్వం, డబ్ల్యూహెచ్ఓ ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిబంధలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని కోరారు. దేనిని అంత విమానం లో ఉన్న వ్యక్తి రికార్డు చేశారు. అనంతరం సోషల్ మీడియాలో పెట్టారు. దేనిని చూసిన నెటిజన్లు ఆంక్షలను అమలు చేయడంలో నిష్పక్షపాతంగా వ్యవహరించిన విమాన సిబ్బందిని ప్రశంసిస్తున్నారు.