Begin typing your search above and press return to search.
ఇంత అప్పులు ఉంటే... ప్రాజెక్టులు ఎక్కడ.. కాంట్రాక్టర్లకు బిల్లులు ఎక్కడ?
By: Tupaki Desk | 9 Feb 2022 6:30 AM GMTనవ్యాంధ్ర.. భవ్యాంధ్రగా మారుతుందని ఆశలు పెట్టుకున్న వారికి.. ఇప్పుడు అప్పులాంధ్రగా మారిపోవడం .. అత్యంత బాధాకరమైన విషయం. `నేను విన్నాను.. నేను ఉన్నాను..` నినాదం.. కాస్తా.. ఇప్పుడు.. ``అప్పు తెచ్చాను.. అప్పులే తెస్తాను`` అన్న విధంగా మారిపోయిందనే విమర్శలు సోషల్ మీడియాలో జోరుగా వినిపి స్తున్నాయి.
దీనికి కారణం.. ఏపీ అప్పుల ఊబిలోకి కూరుకుపోవడమే! సహజంగానే కరోనా నేపథ్యంలో వచ్చి న ఇబ్బందులను ఎవరూ కాదనరు.. ఈ క్రమంలోనే కేంద్రం నుంచి రాష్ట్రం వరకు కూడా అప్పులు చేశారు. అయితే.. పరిధికి మించి.. అప్పులు చేయడమే ఇప్పుడు చర్చకు దారితీసింది.
రాష్ట్రాలకు కేంద్రం కేటాయించే ఎఫ్ఆర్ఎంబీ పరిధిని మించిపోయి..ఆర్థిక అనుమతులు కూడా దాటి పోయి .. అలోలక్ష్మణా అంటూ.. అప్పుల కోసం అంగలార్చాల్సిన దుస్థితికి రాష్ట్రం నేడు దిగజారిపోయింది. రాష్ట్రా ధి నేత అయిన సీఎం అంతటి వాడు వెళ్లి.. అప్పుల కోసం అడగాల్సిన పరిస్థితి రావడం చాలా దురదృష్ట కరమేనని అంటున్నారు మేధావులు.
తాజాగా సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలోని మర్మాన్ని.. కేంద్రం పార్లమెం టు సాక్షిగా వెల్లడించింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు రూ.27,325 కోట్ల అదనపు అప్పులకు అనుమతి ఇవ్వాలని జగన్ కోరినట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు.
అంతేకాదు... గతనెల 3న జగన్ అప్పులకు అనుమతి కోరేందుకే ఢిల్లీకి వచ్చారని తెలిపింది. రెండున్నరే ళ్లుగా జగన్ సర్కారు అప్పులు చేయడమే పనిగా పెట్టుకుంది. ఆ అప్పుల అసలు, వడ్డీలు చెల్లించడానికే ఖజానా సరిపోవడంలేదు. 2021-22లో కేంద్రం ఏపీకి రూ.42,472 కోట్లు అప్పు చేసుకోవడానికి అనుమతి చ్చింది.
అయితే... గత మూడేళ్లలో రాష్ట్రం దీనికంటే అదనంగా రూ.17 వేల కోట్లు అప్పు చేసింది. దీంతో... ఆ మొత్తానికి కోత పెట్టి ఈ ఆర్థిక సంవత్సరం రూ.25,472 కోట్లకు మాత్రమే కేంద్రం అనుమతించింది.
2021 ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు 9 నెలల్లో జగన్ ప్రభుత్వం రూ.58,142 కోట్ల అప్పులు చేసినట్టు డిసెంబరు నెలకు సంబంధించిన నివేదికలో ‘కాగ్’ వెల్లడించింది. అంటే, కేంద్రం ఇచ్చిన అనుమతుల కంటే వైసీపీ ప్రభుత్వం రూ.18,000 కోట్ల అప్పులు అదనంగా చేసింది.
ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారం 2021 మార్చి 31వ తేదీ నాటికి రాష్ట్ర పబ్లిక్ డెట్ రూ.3.55 లక్షల కోట్లుగా ఉంది. ఆ తర్వాత 9 నెలల్లో రూ.58,142 కోట్ల అప్పు చేసినట్టు కాగ్ స్వయంగా వెల్లడించింది.
ఈ పరిస్థితిని గమనిస్తే.. రాష్ట్రంలో ఇక ప్రాజెక్టుల పరిస్థితి.. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు వంటివి అన్నీ కూడా.. పూర్తిగా అటక ఎక్కేసినట్టేనని అంటున్నారు పరిశీలకులు. నిజానికి వైసీపీ సర్కారుకు మరో రెం డున్నరేళ్ల సమయం ఉంది. ఇప్పటికే చేతులు ఎత్తేసిన పరిస్థితిలో.. మరి ఈ రెండున్నరేళ్లు ఎలా నెట్టుకు వస్తారనేది చూడాలి.
మరోవైపు.. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించని నేపథ్యంలో వారు పనులు చేయడం లేదు. చేసిన పనులకు డబ్బులు ఇస్తేనే కాలు ముందుకు కదుపుతామని చెబుతున్నారు.
మరోవైపు.. పోలవరం... వెలిగొండ సహా.. అనేక ప్రాజెక్టులు 30శాతం పనుల కోసం ఎదురు చూస్తున్నాయి. వీటికి స్వల్ప మొత్తంలో నిధులు కేటాయించినా ప్రాజెక్టులు పూర్తయి.. రాష్ట్రానికి అందివవస్తాయి. అయితే.. ఇప్పుడు ఆ ప్రాజెక్టులను పట్టించుకునేందుకు, బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడం గమనార్హం.