Begin typing your search above and press return to search.

ఇదే నిజ‌మైతే.. ఇంతక‌న్నా వైసీపీకి ఘోరం లేదు..!

By:  Tupaki Desk   |   15 Oct 2022 9:30 AM GMT
ఇదే నిజ‌మైతే.. ఇంతక‌న్నా వైసీపీకి ఘోరం లేదు..!
X
పాద‌యాత్ర‌.. దీని గురించి.. ఎవ‌రికి తెలిసినా.. తెలియ‌క పోయినా.. సీఎం జ‌గ‌న్‌కు ఆయ‌న కుటుంబానికి బాగా తెలుసు. ఎందుకంటే.. సుదీర్ఘ దూరం పాద‌యాత్ర చేసి..వేల కొద్దీ కిలోమీట‌ర్ల దూరాన్ని న‌డిచిన నాయ‌కు డిగా జ‌గ‌న్ రికార్డు సృష్టించారు. అంటే.. పాద‌యాత్ర‌లో వేసే ప్ర‌తి అడుగులో ఉన్న పెయిన్ ఆయ‌న‌కు బాగా తెలుసు. మ‌రి అలాంటి జ‌గ‌న్ ఇప్పుడు.. అమ‌రావ‌తి రైతుల పాద‌యాత్ర విష‌యంలో అనుస‌రిస్తున్న విధా నం ఏంట‌నేది చ‌ర్చ‌కు వ‌స్తోంది.

ఎందుకంటే. తాజాగా.. అమ‌రావ‌తి రైతులు.. మ‌హాపాద‌యాత్ర 2.0ను కొన‌సాగిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ యాత్ర .. గోదావ‌రి జిల్లాల్లో సాగుతోంది. మ‌రో రెండు రోజుల్లో.. ఇది తూర్పుగోదావరి జిల్లాలోకి ప్ర‌వేశించ నుంది. అయితే.. ఈ స‌మ‌యంలో వారు ప్ర‌యాణించాల్సిన మార్గంలో ఉన్న రైల్ క‌మ్ రోడ్ బ్రిడ్జిని అధికారులు మూసివే య‌డం.. వివాదాల‌కు.. రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు కూడా.. తావిస్తోంది. గ‌తంలో జ‌గ‌న్ కూడా.. ఈ ఫ్లైవోవ‌ర్‌.. వంతెన‌పై పాద‌యాత్ర చేశారు.

ఆ స‌మ‌యంలో కూడా.. ప్ర‌భుత్వం అడ్డ‌గించేందుకు ప్ర‌య‌త్నించింద‌ని.. వైసీపీ నాయ‌కులు ఆరోపించా రు. కానీ.. ఎలాంటి అడ్డంకులు లేకుండానే జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను ముగించుకున్నారు. అయితే..ఇప్పుడు రైతుల విష‌యానికి వ‌స్తే.. మాత్రం ఆది నుంచి కూడా..

పాద‌యాత్ర‌కు అనుమ‌తించ‌డం లేదు. వైసీపీ తీసుకున్న మూడు రాజ‌ధానుల సిద్ధాంతానికి (తాజాగా తీసుకున్న‌) ఇది వ్య‌తిరేక‌మ‌ని భావిస్తూ.. పాద‌యా త్ర‌కు అనుమ‌తి ఇవ్వ‌డం లేదు. దీంతో రైతులు.. న్యాయ‌స్థానం నుంచి అనుమ‌తి తెచ్చుకుని మ‌రీ పాద‌యాత్ర చేస్తున్నారు.

అయితే.. దీనికి కూడా.. ఇప్పుడు ఇలా బ్రిడ్జి ర‌హ‌దారిని మూసేసి అడ్డంకులు సృష్టించ‌డం.. ఎందుక‌నేది ప్ర‌జాస్వా మ్య వాదుల ప్ర‌శ్న‌. ఇలాంటి చేయ‌డం వల్ల‌.. ప్ర‌భుత్వానికి మ‌రింత చెడ్డ‌పేరు రావ‌డంతోపాటు.. ప్ర‌జ‌ల్లో రైతుల‌కు మ‌రింత సానుభూతి పెరుగుతుంద‌ని అంటున్నారు. అలాకాకుండా.. రైతుల‌ను వారి మానాన వారిని వ‌దిలేస్తే.. పాద‌యాత్ర పూర్త‌యి.. ప్ర‌భుత్వం ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసింద‌నే పేరు వ‌స్తుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.