Begin typing your search above and press return to search.
ఈ ర్యాలీ హైదరాబాద్ జరిగి ఉంటే కేసీఆర్ ఫుల్ హ్యాపీ!
By: Tupaki Desk | 11 May 2019 4:39 AM GMTఉద్యమ నేతలు ఉద్యమాల్ని.. నిరసన ర్యాలీల పట్ల పాజిటివ్ గా రియాక్ట్ కారా? అంటే అవునన్న మాట తెలంగాణవాదుల నోట చప్పున వస్తుంది. సుదీర్ఘకాలం పాటు ఉద్యమ పార్టీగా తెలంగాణవాదులకు సుపరిచితమైన కేసీఆర్.. ఆయన హయాంలో ఉద్యమాలకు.. నిరసనలకు.. ఆందోళనల విషయంలో ఆయన స్పందన మరోలా ఉంటుందని భావించారు. కానీ.. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ర్యాలీలకు.. వ్యతిరేక ఆందోళనల విషయంలో కేసీఆర్ తీరు ఎలా ఉంటుందన్నది అందరికి తెలిసిందే.
నిజానికి తెలంగాణలో.. మరి ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ఈ రోజున ఆందోళనలకు.. ర్యాలీలకు ఎంతవరకు అనుమతి ఇస్తున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది.. ఒక ర్యాలీతో కేసీఆర్ ఫుల్ ఖుషీ కావటం ఏమిటంటారా? ఆ ర్యాలీ అలాంటిది మరి. యూపీలోని ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో మహిళలు ఓటు ప్రాధాన్యతను తెలిపేలా తాజాగా ఒక ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో భాగంగా మహిళలు గులాబీ రంగు చీరలు కట్టుకొని ఓటు వేయాల్సిన అవసరం తెలిపేలా ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున సాగిన ఈ పింక్ ర్యాలీని కేసీఆర్ కానీ చూసి ఉంటే మస్తు ఖుఫీ అయేటోళ్లు అన్న మాట వినిపిస్తోంది. తమ పార్టీ కలర్ అయిన పింక్ ను ప్రతిబింబించేలా గులాబీ చీరలతో ఒక చక్కటి ర్యాలీ జరిగితే.. అందునా అది ఓటరు చైతన్య కార్యక్రమమైతే.. కేసీఆర్ హ్యాపీగా ఫీల్ కాకుండా ఉంటారా చెప్పండి!