Begin typing your search above and press return to search.
ట్రంప్ ఫెయిల్ అయితే.. 22 లక్షల మంది అమెరికన్ల ప్రాణాలు పోతాయట
By: Tupaki Desk | 18 March 2020 6:45 AM GMTకరోనా కలకలం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ప్రపంచానికి పెద్దన్న లాంటి అమెరికాలో.. కరోనా ప్రభావం అంతకంతకూ పెరగటమే కాదు.. వందల్లో మరణాలు చోటు చేసుకోవటం షాకింగ్ గా మారింది. మన తో పోలిస్తే.. అమెరికన్లకు ఉండే మౌలిక సదుపాయాలు.. రక్షణ చర్యలు.. యంత్రాంగం.. శాస్త్రసాంకేతికత చాలా ఎక్కువ. ఏ విషయంలోనూ అగ్రరాజ్యం తో పోల్చుకోలేని పరిస్థితి. అలాంటిది కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవటంలో ఆ దేశంలో కిందామీదా పడుతుందని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. కరోనా వైరస్ ఏ స్థాయికి చెలరేగి.. ఎంత ప్రమాదకరంగా మారుతుందన్న విషయానికి సంబంధించి లండన్ ఇంపీరియల్ కాలేజీ జీవగణితం ప్రొఫెసర్ నీల్ ఫెర్గూసన్ టీం షాకింగ్ అంశాన్ని వెల్లడించింది. తాము చేపట్టిన అధ్యయనం ప్రకారం కరోనా మానవాళిని ఏ రీతిలో కబళించివేస్తుందన్న విషయాన్ని కళ్లకు కట్టేలా చెప్పుకొచ్చారు. తాజాగా వ్యాపిస్తూ.. ప్రపంచ దేశాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా.. దాదాపు వందేళ్లకు పైనే (1918లో) ప్రపంచాన్ని వణికించిన ఫ్లూతో పోల్చారు.
కరోనాను కట్టడి చేస చర్యలు ప్రభావవంతంగా లేని పక్షంలో అమెరికాలో 22 లక్షల మంది.. బ్రిటన్ లో ఐదు లక్షల మంది మరణించే ప్రమాదం ఉందని చెప్పారు. కరోనాను నియంత్రించటానికి ఈ వైరస్ లక్షణాలు ఉన్న వారిని ఇళ్ల దగ్గరే ఒంటరిగా ఉంచటానికి మించిన చర్య మరేదీ ఉండదంటున్నారు. జనజీవనం మీద ఆంక్షలు విధించకపోవటం తో 2.5లక్షల మంది మరణిస్తున్నారని చెప్పారు. కరోనానుకంట్రోల్ చేసే విషయంలో ట్రంప్ సర్కారు విఫలమైతే.. అమెరికాలో చోటు చేసుకునే నష్టం ఎంత తీవ్రంగా ఉంటుందన్నది సదరు ప్రొఫెసర్ మాటలు స్పష్టం చేస్తున్నాయని చెప్పక తప్పదు.