Begin typing your search above and press return to search.
ఇక వోడాఫోన్ పని అయిపోయినట్టేనా?
By: Tupaki Desk | 18 Feb 2020 7:30 PM GMTసుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో టెలికాం కంపెనీలన్నీ కూడా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. మార్చి 17లోగా టెలికాం కంపెనీలన్నీ తమ బకాయిలను పూర్తిగా చెల్లించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే , సుప్రీం ఇచ్చిన తీర్పు ప్రకారం వోడాఫోన్ ఐడియా తన పూర్తి బకాయిని నిర్ణిత గడువులోపల చెల్లిస్తే ..ఆ తరువాత కంపెనీ మూసుకోవాల్సిందే అని సంస్థ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ స్పష్టం చేశారు.
గత పదేళ్ల కాలంలో వొడాఫోన్ ఐడియా రూ 2 లక్షల కోట్ల నష్టాల్లో కూరుకుపోయిందని, ప్రభుత్వానికి పేరు కుపోయిన బకాయిలను రాత్రికి రాత్రి చెల్లిస్తే కంపెనీ మూతపడుతుందని, సంస్థ మూతపడితే 10,000 మంది ఉద్యోగాలు కోల్పోతారని, 30 కోట్ల మంది సబ్ స్ర్కైబర్లకు అసౌకర్యం కలుగుతుంది అని తెలిపారు. దీనితో టెలికాం రంగంలో పోటీతత్వం కనుమరుగై రెండు సంస్థల ఆధిపత్యమే కొనసాగేందుకు దారితీస్తుందని అన్నారు. ప్రభుత్వానికి వొడాఫోన్ ఐడియా రూ 7000 కోట్ల బకాయిలుండగా పెనాల్టీ - వడ్డీపై పెనాల్టీలతో కలుపుకుని మొత్తం రూ 25,000 కోట్లు ఉంది.
ఈ మొత్తంలో ఇప్పటికే కంపెనీ రూ. 2150 కోట్లు చెల్లించిందని ముకుల్ రోహత్గీ చెప్పారు. ఈ నేపథ్యంలో పూర్తి బకాయి చెల్లించాలి అంటే కష్టమని ,బకాయిలను రాత్రికిరాత్రే చెల్లించే అవకాశం లేదని టెల్కోలు టెలికాం శాఖకు తేల్చిచెప్పాయని, ప్రభుత్వం సైతం పరిస్థితికి తగినట్టు వ్యవహరించాలని, ఆలా కుదరని పక్షంలో టెలికాం రంగంలో మోనోపలీకి దారితీస్తుందని ఆయన తెలిపారు. సుప్రీం ఇచ్చిన గడువు నేపథ్యం లో భారతి ఎయిర్ టెల్ రూ 10,000 కోట్లు - టాటా గ్రూప్ లు 2,197 కోట్లు ఇప్పటికే చెల్లించాయి. ఎయిర్ టెల్ ప్రభుత్వానికి ఇంకా రూ 25,585 కోట్లు చెల్లించాల్సి ఉంది. టాటా టెలీసర్వీసెస్ మొత్తం రూ 13,800 కోట్లు చెల్లించాల్సిఉంది.