Begin typing your search above and press return to search.
కాపునాడుకు వైసీపీ రాదంతే...లెక్కలు అవేనా...?
By: Tupaki Desk | 26 Dec 2022 10:59 AM GMTకాపునాడు మీటింగ్ ని విశాఖలో ఘనంగా ఏర్పాటు చేశారు. దీని వెనక ఒక రాజ్కీయ అజెండా కూడా ఉంది అని అంటున్నారు. దాదాపుగా ఏడాది పొడవునా హైదరాబాద్ విజయవాడ, విశాఖలో మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు కాపు నేతలతో సమావేశాలు భేటీలు నిర్వహించిన తరువాత జరుపుతున్న మీటింగ్ ఇది. అంటే నాటి మీటింగుల భేటీల అవుట్ కం ఈ మీటింగ్ ద్వారా బయటకు వస్తుంది అని అంటున్నారు.
ఇకా కాపు నేతల భేటీలో గంటా సహా పలువురు చేసిన కీలక వ్యాఖ్యలు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటే కాపునాడు రాజకీయ అజెండా ఏంటో తీర్మానం ఏంటో కూడా చెప్పవచ్చు అని అంటున్నారు. కాపులకు రాజ్యాధికారం కావాలని, కాపు సీఎం ఏపీకి తప్పకుండా వస్తారని గతంలో గంటా కామెంట్స్ చేశారు. ఇపుడు కాపునాడు మీటింగులో కూడా అదే విధంగా డిమాండ్లు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు.
దాంతో అధికార వైసీపీ నేతలు మంత్రులు ఎమ్మెల్యేలు ఈ మీటింగుకు దూరంగా ఉంటారని అంటున్నారు. ఆ మేరకు అధినాయకత్వం నుంచి వారికి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లుగా చెబుతున్నారు. పేరుకు రాజకీయాలకు అతీతంగా కాపునాడు అని అంటున్నా దాని వెనక టీడీపీ జనసేన ఉన్నాయని వైసీపీ అనుమానిస్తోంది. ప్రత్యేకించి గంటా చూస్తే టీడీపీ నాయకుడు. ఆయన ఈ రోజుకీ ఆ పార్టీ ఎమ్మెల్యే. ఇక జనసేనతో టీడీపీ పొత్తుకు చూస్తోంది.
రెండు పార్టీల మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది అంటున్నారు. దానికి ఉదాహరణలుగా పవన్ ఎపుడూ ఎక్కడా చంద్రబాబును విమర్శించరు. అలాగే చంద్రబాబు సైతం జనసేనను పవన్ని విమర్శించారు. దాంతో ఆ విధంగా చూసుకుంటే ఈ రెండు పార్టీలూ కలసి ఏపీలో కూటమి కట్టి వైసీపీని ఓడించాలని చూస్తున్నాయని వైసీపీకి తెలుసు. ఇన్ని తెలిసిన తరువాత కూడా మీటింగ్ కి వెళ్తే అభాసుపాలు కావడం తప్ప మరోటి కానే కాదని అంటున్నారుట.
అదే విధంగా చూస్తే కాపుల రిజర్వేషన్ల మీద కూడా కాపునాడు సభ గర్జిస్తుంది. అలాగే ఏపీలో కాపులకు రాజకీయంగా జరిగే ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా ప్రస్తావిస్తుంది. ఇక జగన్ బంధువుగా ఉన్న గౌతం రెడ్డి అప్పట్లో వంగవీటి రంగాను హత్య చేసినా తప్పులేదని అన్నారని చెబుతున్న ప్రచారం కానీ రంగా ప్రత్యర్ధులుగా ఉన్న దేవినేని కుటుంబ వారసుడు అవినాష్ వైసీపీలో ఇపుడు ఉన్నా రని. ఈ విషయాలు కూడా ప్రస్తావనకు వస్తే ఇబ్బందిగా ఉంటుంది అని అంటున్నారు.
అయితే కాపునాడు మీటింగునకు వెళ్లకపోయినా వంగవీటి రంగాకు వైసీపీ నేతలు నివాళి అర్పించారు. రాధాను పొగుడుతున్నారు. అదే విధంగా కాపు ఎమ్మెల్యేలు, మంత్రులు తాము కాపుల కోసం ఉన్నామని సంకేతాలు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక రకమైన వ్యూహంగా వైసీపీ అమలు చేస్తోంది. ఇక కాపునాడు అంటూ ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి గంటా తాను హైలెట్ కావడంతో పాటు జనసేన టీడీపీ పొత్తులను మరింత దగ్గర చేసే ఎత్తుగడలకు పాల్పడుతున్నరని, ఈ నేపధ్యలో ఆ మీటింగునకు వెళ్లడం అంటే కచ్చితంగా కోరి మరీ ఇబ్బందులు తెచ్చుకోవడమే అని వైసీపీ భావిస్తోందిట. సో కాపునాడుకు వైసీపీ దూరంగా ఉండడానికి ఎన్నో లెక్కలు ఉన్నాయి అని అంటున్నారు
చిత్రమేంటి అంటే కాపునాడు మీటింగ్ ఆహ్వాన పత్రికల మీద బ్యానర్ల మీద ఫ్లెక్సీల మీద వైసీపీ మంత్రులు, మాజీ మంత్రులు ఎమ్మెల్యేల ఫోటోలు ఉన్నాయి. అయినా వైసీపీ మాత్రం ఈ మీటింగ్ కి రాదు రాలేదంతే అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.