Begin typing your search above and press return to search.

డీజీసీఏ గుడ్ న్యూస్ : లగేజ్‌ లేకపోతే..విమాన టికెట్‌ పై డిస్కౌంట్‌!

By:  Tupaki Desk   |   26 Feb 2021 11:30 PM GMT
డీజీసీఏ గుడ్ న్యూస్ : లగేజ్‌ లేకపోతే..విమాన టికెట్‌ పై డిస్కౌంట్‌!
X
ప్రయాణికులకు పౌర విమానయాన శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. లగేజ్‌ లేకుండా ప్రయాణించేవారికి త్వరలో టికెట్ ధరల్లో రాయితీ కల్పించనున్నట్లు వెల్లడించింది. ఇకపై చెక్‌ ఇన్‌ లగేజ్‌ లేకుండా కేవలం క్యాబిన్‌ బ్యాగులతో మాత్రమే ప్రయాణించేవారికి టికెట్లపై డిస్కౌంట్లు కల్పించనున్నారు. దేశీయ విమాన సంస్థలకు డీజీసీఏ శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పాత నిబంధనల ప్రకారం క్యాబిన్ బ్యాగేజీ 7 కిలోలు, చెకిన్ బ్యాగేజీ 15 కిలోల వరకు ఉండొచ్చు. అది దాటితే చార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేవలం క్యాబిన్ లగేజీ లేదా అసలు లగేజీ లేకుండా ప్రయాణించే వారికి టికెట్లను తక్కువ ధరకు ఇచ్చే ఉద్దేశంతో డీజీసీఏ ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చింది.

టికెట్ బుక్ చేసుకునే టైంలోనే లగేజీ బరువును వెల్లడిస్తే టికెట్ ధరలో డిస్కౌంట్ ఇస్తారు. అవసరం లేకపోయినా చిరుతిళ్లు, డ్రింక్స్, మీల్స్, లాంజ్ సర్వీసెస్ వంటి వాటి ద్వారా కూడా అదనంగా భారం పడుతోంది. దీనిపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు రావడంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పందించి, ప్రయాణికులకు ‘నో బ్యాగేజ్’ లేదా ‘ఓన్లీ క్యాబిన్ బ్యాగేజ్’ సౌకర్యం కల్పించింది. అయితే, కేవలం డొమెస్టిక్ విమానాల్లోనే ఈ వెసులుబాటును కల్పించనున్నారు. ఒకవేళ అవీ కావాలనుకునే వారు ప్రత్యేకంగా వాటిని ఎంచుకోవచ్చని డీజీసీఏ పేర్కొంది. ప్రయాణికులు టికెట్‌ బుక్‌ చేసుకునే సమయంలోనే ఈ టికెట్‌ ధరల స్కీం గురించి వారికి తెలియజేయాలని , వీటిని తప్పనిసరిగా టికెట్‌ పై ప్రింట్‌ చేయాలి అని డీజీసీఏ పేర్కొంది.