Begin typing your search above and press return to search.

ఇలా చేస్తే టీడీపీకి సింప‌తీ గ్యారెంటీయే...!

By:  Tupaki Desk   |   20 Aug 2022 1:30 AM GMT
ఇలా చేస్తే టీడీపీకి సింప‌తీ గ్యారెంటీయే...!
X
వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యం సాధించాలి. ఎట్టి ప‌రిస్థితిలోనూ అధికారంలోకి రావాలి. అంతేకాదు.. అసెంబ్లీ సాక్షిగా పార్టీ అధినే త చంద్ర‌బాబు చేసిన‌.. శ‌ప‌థం నెర‌వేర్చాలి. మ‌రి ఇవ‌న్నీ.. ఎలా సాకారం అవుతాయి? ఇదీ.. ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

ఎందుకంటే.. గ‌త ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా ప్ర‌యాణం చేసిన చంద్ర‌బాబు ఘోర ప‌రాజ‌యం మూట‌గ‌ట్టుకున్నారు. సో.. ఇప్పుడు ఇలా ఒంట‌రిగా ప్ర‌యాణం చేసేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు. అలాగ‌ని.. బ‌లవంతంగా ఆయ‌న వేరే పార్టీల‌తో చేతులు క‌ల‌పాల‌ని కూడా అనుకోవ‌డం లేదు. పోనీ.. అధికారం వ‌దిలేసుకుందామంటే.. ఇది ఊహించ‌డానికి కూడా భ‌యంకరం.

సో.. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ముందున్న ఆప్ష‌న్లు ఏంటి? అనేది టీడీపీలో జ‌రుగుతున్న కీల‌క చ‌ర్చ‌. కుదిరితే పొత్తు పెట్టుకుని ముందుకు సాగాల‌ని కొంద‌రు చెబుతున్నారు. అదేస‌మ‌యంలో అధినేత మాత్రం.. పార్టీ నాయ‌కుల‌కు బూస్ట్ ఇచ్చి.. వారు పుంజుకునేలా చేసి.. పార్టీని గాడిలో పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు. కానీ, ఇది కూడా అంతంత‌మాత్రంగానే సాగుతోంది. ఎవ‌రూ కూడా అధినేత చూపిన బాట‌లోను.. ఆయ‌న చెప్పిన విధానంలోనూ పెద్ద‌గా న‌డుచుకోవ‌డం లేద‌నేది నిజం. కొంద‌రు మాత్ర‌మే అధినే త‌చెప్పినా.. చెప్పుకున్నా.. పార్టీ విష‌యంలో దూకుడు చూపిస్తున్నారు.

అయితే.. ఇలా కొద్ది మంది చేస్తే.. వారి వ‌ర‌కే ప‌రిమితం లేదా.. ఆ జిల్లా వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమితం అవుతుంది. మ‌రి రాష్ట్ర వ్యా ప్తంగా పార్టీ పుంజుకోవాలంటే.. అధికారంలోకి రావాలంటే.. వ్యూహం ఏంటి? అనేది కీల‌క విష‌యం. ఈ క్ర‌మంలో కొంద‌రు మేధా వులు చెబుతున్న మాటేంటంటే.. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ అనుస‌రించి వ్యూహాన్ని ఇప్పుడు టీడీపీ కూడా అనుస‌రిం చాల‌ని.. చెబుతున్నారు. గ‌తంలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ఒంట‌రిపోరుకు వెళ్లారు. ప్ర‌జ‌ల్లో సింపతీని రాజేశారు. ``అదిగో వాళ్లంతా క‌లిసి పోటీ చేస్తున్నారు. నేను ఒక్క‌డినే ఉన్నాను. ఒంట‌రిపోరు చేస్తున్నాను`` అంటూ.. ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

ఇది బాగా వ‌ర్క‌వుట్ అయింది. అంతేకాదు.. జ‌గ‌న్ ప‌ట్ల ప్ర‌జ‌ల‌కు కూడా సానుబూతి పెరిగింది. ఇప్పుడు చంద్ర‌బాబు కూడా ఇదే మంత్రాన్ని ప‌ఠించాల‌ని.. కొంద‌రు మేధావులు సూచిస్తున్నారు. ``రాజ‌కీయాల్లో సింప‌తీ ముఖ్యం. చంద్ర‌బాబు ఇప్పుడు చేయాల్సింది సింప‌తీ రాజ‌కీయాలే. ఒంట‌రి పోరుకు సిద్ధ‌ప‌డ‌డం అంటే.. చంద్ర‌బాబు రాజ‌కీయంగా ఒంట‌రి అయినా.. మా కోసం నిల‌బ‌డ్డారు. అనే వాద‌న‌ను బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాలి. అప్పుడు ఖ‌చ్చితంగా ప్ర‌జ‌ల నుంచి ఆయ‌న‌కు సింప‌తీ వ‌స్తుంది. ఇది పార్టీని గెలిపిస్తుంది. అలా కాకుండా పొత్తులు పెట్టుకుంటే.. సింప‌తీ వ‌చ్చే అవ‌కాశం త‌క్కువ‌`` అని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.