Begin typing your search above and press return to search.

ఫామ్ హౌస్ నుంచి బయటకు రాకపోతే.. ప్రపంచ వార్తే

By:  Tupaki Desk   |   4 Oct 2022 4:36 AM GMT
ఫామ్ హౌస్ నుంచి బయటకు రాకపోతే.. ప్రపంచ వార్తే
X
ఫామ్ హౌస్ నుంచి బయటకు రాని ఒక దేశాధినేత ప్రపంచానికి హాట్ న్యూస్ గా మారారు. తన నోటి నుంచి వచ్చే మాటలతో తరచూ సంచలనంగా మారటం తెలిసిందే. ఇంతకీ ఆయన ఎవరో కాదు.. ఉత్తర కొరియా దేశాధ్యక్షుడు కమ్ అరవీర భయంకర నియంతగా పేరున్న కిమ్ జోంగ్ ఉన్. తాజాగా అతగాడు మరోసారి ప్రపంచానికి వార్తగా మారాడు. కారణం.. గడిచిన 23 రోజులుగా ఫామ్ హౌస్ నుంచి బయటకు రాకపోవటం..ఎలాంటి ప్రోగ్రాంలకు అటెండ్ కాకపోవటంతో ఆయనకు ఏమైందన్న ప్రశ్న తలెత్తుతోంది.

కఠిన నిర్ణయాలు తీసుకోవటం.. తనను వ్యతిరేకించే వారిని నిర్దాక్షిణ్యంగా చంపించేందుకు ఏ మాత్రం వెనుకాడని అతడు ప్రాణభయంతో బయటకు రాకుండా ఉన్నారా? అన్నదిప్పుడు సందేహంగా మారింది. ఈ ఏడాదిలో ఇన్నేసి రోజులు బయటకు రాకుండా.. కనిపించకుండా ఉన్న మొదటి సందర్భం ఇదేనని చెబుతున్నారు. దీంతో కిమ్ ఎక్కడ? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. 20 రోజులకు పైనే కనిపించకున్నా.. వార్త కానప్పుడు ఇప్పుడే ఎందుకు అయ్యారంటే దానికి కారణాలు లేకపోలేదు.

గత వారం క్షిపణి పరీక్షను నిర్వహించటం.. ఆ ప్రోగ్రాంకు హాజరు కాకపోవటం.. దేశంలో నెలకొన్ని తీవ్రమైన ఆహార కొరత నేపథ్యంలో నిర్వహించిన రివ్యూకు సైతం రాకపోవటంతో అనుమానాలు మొదలయ్యాయి. అయితే.. ప్రస్తుతం అతగాడు ఉత్తర కొరియా ఈశాన్య దిశగా ఉండే భారీ ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఎందుకిలా? అంటే.. దీని మొదటి కారణం అనారోగ్యం బారిన పడొచ్చన్న ప్రచారమైతే.. మరో కారణంగా ఆ దేశంలో అక్టోబరు - నవంబరులో ప్లూ సీజన్ కావటం.. కరోనా పెరిగే అవకాశం ఎక్కువగా ఉండటంతో బయటకు రాకుండా ఉన్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల ఆ దేశంలో మాస్కు వినియోగం తప్పనిసరి చేస్తూ ఆంక్షల్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఇలాంటి వేళలోనే ఆయన కనిపించటం లేదన్న వార్తల జోరు ఎక్కువైంది. అప్పుడప్పుడు ఉన్నట్లుండి మాయం కావటం.. కొద్ది రోజుల పాటు బయట ప్రపంచానికి దూరంగా ఉండే అలవాటు కిమ్ లో కాస్త ఎక్కువే. గడిచిన ఏడేళ్లలో కిమ్ బయటకు రాకుండా ఎక్కువగా ఉన్నది మాత్రం గత ఏడాది అక్టోబరు -నవంబరు లోనే అని చెబుతారు.

అప్పట్లో 35 రోజులు బయట ప్రపంచానికి కనిపించలేదు. 2021 ముందు కూడా మేలో నెల పాటు బయటకు రాలేదు. అయితే.. అతగాడికి ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొన్నట్లుగా సమాచారం అందలేదని.. దక్షిణ కొరియా నిఘా విభాగం చెబుతోంది. ఏది ఏమైనా ఈ నెల 10న అధికార పార్టీ 77వ ఆవిర్భావ వార్షికోత్సవ వేడుకల్ని నిర్వహించాల్సి ఉంది.

ఆ రోజున జరిగే కార్యక్రమాలకు ఆయన కచ్ఛితంగా హాజరవుతాచని చెబుతున్నారు. ఇన్నేళ్లలో కిమ్ ఎప్పుడూ కూడా వార్షికోత్సవ కార్యక్రమాల్ని మిస్ చేసింది లేదు. ఒకవేళ.. వార్షికోత్సవాలకు హాజరు కాకుంటే మాత్రం లెక్కలో ఏదో తేడా కొట్టినట్లే అన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.