Begin typing your search above and press return to search.
దమ్ముంటే నన్ను కాల్చండి అంటున్న ఒవైసీ
By: Tupaki Desk | 29 Jan 2020 10:17 AM GMTపౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతోన్నాయి. నిరసనల వల్ల పోలీసులు జరిపిన కాల్పుల్లో 20 మందికి పైగా చనిపోయారు. ఇందులో 11 మంది యూపీకి చెందినవారు ఉన్నారు. దీనిపై ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం రిథాలా నియోజకవర్గ అభ్యర్థి మనీశ్ చౌదరి కోసం కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రచారం నిర్వహించారు. సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారిని దేశ ద్రోహులుగా అభివర్ణించారు. అలాగే అక్కడున్న వారి తో కూడా స్లోగన్స్ చేయించారు.
ఈ ప్రచార సమయంలో పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరసత్వ రిజిష్టర్ వ్యతిరేకిస్తోన్న దేశద్రోహులను కాల్చివేయాలని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చేసిన కీలక వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. సీఏఏ, ఎన్ ఆర్సీని వ్యతిరేకించేవారిని కాల్చివేయాలని కామెంట్ చేశారు. కేంద్రమంత్రి చేసిన కామెంట్ల పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు.
'ఎక్కడి రావాలో చెప్పండి, ఆ ప్రాంతానికి వస్తా.. సీఏఏ, ఎన్ఆర్సీని వ్యతిరేకించే వారిని కాల్చేస్తా అని మీ కామెంట్లతో భయపడడం లేదు. ఆ చర్యలను నిరసిస్తూ వేలాదిమంది తల్లులు, సోదరులు రోడ్డు మీదికొస్తున్నారు. దేశాన్ని కాపాడుకొనేందుకు వారు ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి సమయంలో మీరు కాల్చేస్తా అని చెబితే భయపడేది మాత్రం లేదు' అని ఒవైసీ స్పష్టంచేశారు. ఇకపోతే, ఠాకూర్ చేసిన ఈ కీలక వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. అతనికి షోకాజు నోటీసు జారీచేసింది. వ్యాఖ్యలపై జనవరి 30వ తేదీ మధ్యాహ్నం లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కానీ కేంద్రమంత్రి వ్యాఖ్యలను బీజేపీ నేతలు వెనకొసుకొచ్చారు. అందులో తప్పేముందని కవర్ చేసే ప్రయత్నం చేశారు.