Begin typing your search above and press return to search.

ఎక్కువమందితో శృంగారం చేస్తే ఆ డేంజర్ వ్యాధి వస్తుందట?

By:  Tupaki Desk   |   17 July 2022 3:30 AM GMT
ఎక్కువమందితో శృంగారం చేస్తే ఆ డేంజర్ వ్యాధి వస్తుందట?
X
శృంగారం దివ్యౌషధం అంటారు. అయితే అది ఒకరితోనే చేస్తేనే అందం.. ఆరోగ్యం.. విచ్చలవిడిగా శృంగారం చేస్తే సకల రోగాలు వస్తుంటాయి. ఒకరికంటే ఎక్కువమందితో శృంగారం ఎయిడ్స్ వ్యాధి సంక్రమిస్తుంది. హ్యూమన్ ఇమ్యూనోడెఫిసియెన్సీ వైరస్ కారణంగా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి రావడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఈ వ్యాధి మనషులకు మాత్రమే సోకుతుంది. ఎయిడ్స్ ను తగ్గించేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం శూన్యం.

లైంగికంగా ఎక్కువమందితో శృంగారం చేసినప్పుడు ఇన్ఫెక్షన్స్ సోకుతాయి. లైంగికంగా కలిసినప్పుడు బ్యాక్టీరియా, పరాన్నజీవి శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఓ వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వస్తాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. 30కిపైగా విభిన్న బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవులు లైంగిక సంపర్కం ద్వారా సంక్రమిస్తాయి.

సిఫిలిస్, గనేరియా, క్లామిడియా, ట్రైకోమోనియాసిస్ వంటి శృంగార సమస్యలకు ప్రస్తుతం ట్రీట్ మెంట్ ఉంది. అయితే హైపటైటిస్ బి, హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ (హెచ్.ఎస్.వీ), హెచ్.ఐవీ హ్యుమన్ పాపిల్లోమావైరస్ (హెచ్.పీవీ)లకి మాత్రం ట్రీట్ మెంట్ లేని వైరస్ ఇన్ఫెక్షన్స్.  ప్రపంచ ఆరోగ్యం సంస్థ ప్రకారం.. గర్భాశయ క్యాన్సర్ లో ఎక్కువ భాగం అంటే 95శాతం హ్యుమన్ పాపిల్లోమావైరస్ కారణంగా వస్తుంది.

ఈ హెచ్.పీవీ అనేది అత్యంత సాధారణ లైంగిక సంక్రమణ. ఇది సాధారణంగా యోని, అంగ, నోటితో చేసే శృంగారం, అదే విధంగా ఎక్కువమందితో శృంగారం కారణంగా సంక్రమిస్తుంది. సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా సాధారణమైన  హెచ్.పీవీ సంబంధిత వ్యాది అని చెబుతున్నారు.

ఒకరికంటే చాలా మందితో లైంగిక సంబంధం ఉన్న వారికి ఈ వ్యాధి సోకుతుంది. లైంగికంగా చూరుకుగా ఉండేవారికి.. కండోమ్స్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా శృంగారం చేసే వారికి సర్వైకల్ క్యాన్సర్ వ్యాధి సోకుతుందని తేలింది.