Begin typing your search above and press return to search.
మోడీ ఇచ్చిన లాస్ట్ ఛాన్స్ ను మిస్ చేసుకుంటే..
By: Tupaki Desk | 29 Nov 2016 4:11 AM GMTకొద్ది నెలల క్రితం తమ దగ్గరున్ను నల్లధనాన్ని స్వచ్ఛంద వెల్లడించి.. గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వం పేర్కొన్న మొత్తాన్ని పన్నురూపంలో చెల్లించే అవకాశం ఇచ్చినప్పుడు కొందరు మాత్రం దీన్ని ఉపయోగించుకుంటే.. మరికొందరు మాత్రం కామ్ గా ఉండిపోయారు. ఇలాంటి తాము ఎన్నో చూశామని.. ఎంతోమంది ప్రధానమంత్రుల్ని చూశామని.. వారికి మించి మోడీ మాత్రం ఏం చేయగలరన్న భావనతో స్వచ్ఛంద ఆదాయ వెల్లడి అంశాన్ని లైట్ తీసుకున్నోళ్లు ఉన్నారు.
కానీ.. అలాంటి ఆలోచనా విధానం ఎంత తప్పన్న విషయాన్ని మోడీ తన నోట్ల రద్దు నిర్ణయంతో నల్ల కుబేరులకు కళ్లు తెరిపించటం మర్చిపోకూడదు. తమకు లభించిన బంగారం లాంటి ఆఫర్ ను మిస్ చేసుకున్నామని తెగ ఫీలవుతున్న వారికి లాస్ట్ ఛాన్స్ గా ఒక ఆఫర్ ను తాజాగా ప్రకటించటం తెలిసిందే. ఇప్పటికే ఆలస్యం చేసిన వారు.. ఇక అలాంటి తప్పులు చేస్తే అందుకు భారీగా ఫలితం అనుభవించాల్సి ఉంటుందన్న మాట వినిపిస్తోంది.
బ్లాక్ మనీ ఎక్కడ ఉన్నా.. దాన్ని కంట్రోల్ చేసేందుకు ఎన్నిప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాల్ని షురూ చేసిన మోడీసర్కారు కారణంగా బ్లాక్ మనీ ఉన్న వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. తాజాగా ఐటీ చట్టానికి మార్పులు చేస్తూ ప్రతిపాదనల్ని సమర్పించిన కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నిర్ణయం నేపథ్యంలో మోడీ సర్కారు ఇచ్చిన ఆఖరి అవకాశాన్ని అందిపుచ్చుకోవటం మంచిదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. ఇప్పుడు కానీ ఈ సదవకాశాన్ని కానీ మిస్ అయితే ఎంత నష్టపోతారో చెబుతున్నారు.
తమ దగ్గర ఉన్న బ్లాక్ మనీ వివరాల్ని వెల్లడించకుండా ఉండిపోతే.. అలాంటి వారిని కానీ ఐటీ శాఖ గుర్తిస్తే.. భారీ ఎత్తున జరిమానా విధించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పుడు ప్రకటించిన స్కీమ్ ముగిసిన తర్వాత కానీ ఐటీ అధికారులకు నల్లధనం పట్టుబడితే.. సదరు బ్లాక్ మనీ మీద 60 శాతం పన్ను విధించటంతో పాటు.. ఈ పన్నుపై మరో 25 శాతం సర్ చార్జి ఉండనుంది.అంటే.. అటూఇటూగా75 శాతం మేరకు పన్ను విధిస్తారు.
అంతేకాదు.. దీనికి అదనంగా మరో 15 శాతం జరిమానాను విధించే వీలుంది. వీటన్నింటిని కలుపుకుంటే.. తాము పట్టుకున బ్లాక్ మనీలో 85 శాతాన్ని కేంద్రం తన సొంతం చేసుకుంటుందన్న మాట. అలాంటి అవకాశం ఇచ్చే కంటే.. ముందే బుద్దిగా చెప్పేస్తే యాభైశాతంతోనే పోయే అవకాశం ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు. మోడీ సర్కారు ఇచ్చిన లాస్ట్ ఛాన్స్ పై నల్లకుబేరులు కాసింత ఆలోచిస్తే.. భవిష్యతులో తిప్పలు తప్పటం ఖాయమని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/