Begin typing your search above and press return to search.

ఈ సన్నటి బిల్డింగ్ గురించి తెలిస్తే నోరెళ్లబెడతారంతే

By:  Tupaki Desk   |   28 April 2022 12:30 AM GMT
ఈ సన్నటి బిల్డింగ్ గురించి తెలిస్తే నోరెళ్లబెడతారంతే
X
‘సైజ్ జీరో’కు సన్నటి బిల్డింగ్ కు లింకేమిటి? అన్న ప్రశ్న రావొచ్చు. నడుము ఉందా లేదా? అన్నట్లుగా ఉండే 28 అంచుల నడుమును సైజ్ జీరోగా వ్యవహరించటం తెలిసిందే. శరీర కొలతలకు సంబంధించిన దీనికి.. ఇప్పుడు చెప్పబోయే సన్నటి బిల్డింగ్ కు ఉన్న పోలిక ఏదైనా ఉంటే.. మనిషి శరీరంలో నడుము ఎంతో కీలకం.

దాని సైజ్ స్లీక్ గా ఉండటం.. ఉంచుకోవటం అంత తేలికైన విషయం కాదు. అలానే.. ఒక భారీ భవనాన్ని స్లీక్ గా నిర్మించటం మామూలు విషయం కాదు. అలాంటి అసాధారణమైన భవనం కావటంతో సైజ్ జీరోతో పోల్చాల్సి వచ్చింది.

ప్రపంచలో అత్యంత ఎత్తైన భవనం ఏదన్న వెంటనే బుర్జ్ ఖలీఫా అనేస్తాం. అలాంటిది ప్రపంచంలోనే అత్యంత సన్నని.. ఎత్తైన భవనం ఏదంటే నోరు వెళ్లబెట్టేస్తాం. కానీ.. ఈ కథనం చదివిన తర్వాత ఆన్సర్ మీ చేతిలో ఉంటుందని చెప్పక తప్పదు.

ఈ సన్నని బిల్డింగ్ న్యూయార్కు లోని మాన్ హట్టన్ లో ‘‘స్టెయిన్ వే టవర్’’ పేరుతో నిర్మించారు. దీని వెడల్పు ఎంతో తెలుసా? అక్షరాల 17.5 మీటర్లు మాత్రమే. ఎత్తు మాత్రం ఏకంగా 435 మీటర్లు. ఎత్తుకు.. వెడల్పుకు మధ్య వ్యత్యాసాన్ని కొలిస్తే దాని నిష్పత్తి 25:1 గాచెప్పొచ్చు. ఇక బుర్జ్ ఖలీపా వెడల్పు 45 మీటర్లు.

బుర్జ్ ఖలీపా వెడల్పులో కేవలం 38 శాతం మాత్రమే ఉండే ఈ సన్నని భవనంలో ఏకంగా 82 అంతస్తులు.. 62 అపార్ట్ మెంట్లు ఉండటం విశేషం. ఒక్కో అపార్ట్ మెంట్ ధర మన రూపాయిల్లో దాదాపు రూ.60 కోట్లుగా చెబుతారు. ఇక.. దీని పెంట్ హౌస్ ధర అయితే ఏకంగా రూ.500 కోట్లుగా చెబుతున్నారు.

ఈ స్లీక్ బిల్డింగ్ ను డిజైన్ చేసింది అమెరికాకుచెందిన ‘షాప్’ అనే సంస్థ. ఏమైనా.. నిర్మాణ రంగంలో అద్భుతంగా చెప్పే ఈ సన్నని భవనం ఇప్పుడు అందరిని విపరీతంగా ఆకర్షిస్తోంది.