Begin typing your search above and press return to search.
హైదరాబాద్ రెస్టారెంట్ల మార్కెట్ షేర్ తెలిస్తే.. నోట మాట రాదంతే
By: Tupaki Desk | 29 Jan 2022 11:30 PM GMTదేశంలో ఎన్నో మహానగరాలు ఉండొచ్చు కానీ.. ఆహార స్వర్గంగా మాత్రం హైదరాబాద్ మహానగరాన్ని చెప్పొచ్చు. ఈ ముత్యాల నగరం గురించి చెప్పినంతనే అందరికి గుర్తుకు వచ్చేది హైదరాబాదీ బిర్యానీ. అంతేకాదు.. సౌతిండియాకు చెందిన అన్ని రకాల వంటకాలు మాత్రమే కాదు.. దేశీయంగా ఫేమస్ అయిన వంటకాలు..చైనీస్.. అరబ్.. ఇటాలియన్.. ఇలా రుచులు ఏవైనా సరే.. హైదరాబాద్ మహానగరంలో లభ్యం కావటం ఈ సిటీ గొప్పతనంగా చెప్పాలి. ఇక్కడ దొరికే ఫుడ్ కు తగ్గట్లే.. ఇక్కడి ప్రజలు ఎక్కువగా బయట తినేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు.
వేగవంతమైన జీవితం.. భార్యభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులు కావటంతో పాటు.. విభిన్న రుచులకు పేరున్న మహానగరంలోని రెస్టారెంట్లలో తినేందుకు ఇష్టపడుతుంటారు. ఈ విషయాన్ని తాజాగా బయటకు వచ్చిన గణాంకాలు మరో ఆసక్తికర అంశాన్ని వెల్లడిస్తున్నాయి. దేశంలోని మిగిలిన నగరాలతో పోలిస్తే.. హైదరాబాద్ మహానగరం రెస్టారెంట్ల బిజినెస్ లో దూసుకెళుతోందని జాతీయ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
హైదరాబాద్ లోని ప్రతి 7 ప్రముఖ రెస్టారెంట్లలో రూ.6037 కోట్లు.. చైన్ రెస్టారెంట్లలో రూ.1380 కోట్లుఉండగా.. మిగిలిన రెస్టారెంట్లలో రూ.4657 కోట్ల బిజినెస్ జరుగుతుందని చెబుతున్నారు. ఈ లెక్కలన్ని కూడా ఒక లెక్క ప్రకారం జరిగే రెస్టారెంట్ల వ్యాపారస్తుల నుంచి అందుతున్న గణాంకాలతో ఈ లెక్క వేశారు. ఇది కాకుండా.. చిన్న చితకా రెస్టారెంట్లతో కలిపితే.. ఈ లెక్కలు మరింత భారీగా ఉంటాయని చెప్పొచ్చు.
ఒక అంచనా ప్రకారం హైదరాబాద్ మహానగరంలో రెస్టారెంట్ల వ్యాపారం రికార్డుస్థాయిలో రూ.12వేల కోట్లకు దగ్గరగా ఉందంటున్నారు. రెస్టారెంట్ల వ్యాపార వ్యవహారాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఈ సంస్థను 1982లో ప్రారంభించారు. తాజాగా హైదరాబాద్ చాప్టర్ ను షురూ చేవారు. ప్రస్తుతం ఈ చాప్టర్ లో 200 వరకు ఉండగా.. రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా 2000 వరకు ఉన్న రెస్టారెంట్లు.. హోటళ్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ సంస్థ రెస్టారెంట్లకు ప్రభుత్వానికి వారధిగా నిలిచి.. వ్యాపార రంగానికి చెందిన వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తుంటారు.