Begin typing your search above and press return to search.
వైరల్ పిక్స్ః రోహిత్ శర్మ ఇల్లు చూశారంటే..
By: Tupaki Desk | 7 Jun 2021 2:30 AM GMTటీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో క్రికెట్ ఫ్యాన్స్ కు చెప్పాల్సిన పనే లేదు. తనదైన రోజున ఆకాశమే హద్దుగా చెలరేగిపోతాడు. రోహిత్ బ్యాటింగ్ గురించి ప్రపంచం మొత్తం తెలిసినప్పటికీ.. అతని పర్సనల్ లైఫ్ గురించి మాత్రం తక్కువ మందికే తెలుసు. తన వివరాలను పెద్దగా పంచుకోడీ హిట్ మ్యాన్. అలాంటి రోహిత్ ఇల్లు గురించిన విశేషాలు ఇప్పుడు చూద్దాం.
ముంబైలోని వర్లి ప్రాంతంలో ఉన్న అహుజా టవర్స్ లోని 29వ ఫ్లోర్ లో ఉంది రోహిత్ హౌస్. అరేబియా సముద్రానికి ఎదురుగా ఉండే ఈ ఫ్లాట్ నుంచి చూస్తే.. సముద్రం మొత్తం అద్భుతంగా కనిపిస్తుంది. 270 డిగ్రీస్ లో సీ వ్యూ కేక పెట్టిస్తుంది. ఇక, రోహిత్ అపార్ట్ మెంట్ మొత్తం 6 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో నాలుగు బెడ్ రూములు ఉంటాయి. రోహిత్ ఆఫీస్ కార్యకలాపాల కోసం కూడా ప్రత్యేకమైన గది ఉంది. ఇంటితో సంబంధం లేకుండా బయట నుంచి వచ్చివెళ్లేలా ఏర్పాటు ఉంది.
రోహిత్ శర్మ జిమ్ కోసం వేరే ప్రాంతానికి వెళ్లడు. ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్నాడు. ఇక, తన కూతురు ఆడుకోవడానికి పూర్తి సెక్యూరిటీ జోన్ ఏర్పాటు చేయడం విశేషం. పెంపుడు కుక్క కోసం ప్రత్యేకమైన ప్లేస్ ను డిజైన్ చేశారు. బాల్కనీ మొత్తం టింబర్, వుడ్ తో అందంగా తీర్చి దిద్దారు. తన కిట్ బ్యాగ్, ఇతర క్రీడా సామగ్రిని దాచుకోవడానికి స్పెషల్ స్టోర్ రూమ్ కూడా ఉంటుంది. రోహిత్ టోర్నీల కోసం నిత్యం దేశ, విదేశాలకు వెళ్లి వస్తుంటాడు కాబట్టి.. ఎయిర్ పోర్టుకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్లాట్ ను ఎంచుకున్నాడు.
ఇన్ని ప్రత్యేకతలున్న ఈ ప్లాట్ లో ఎంత మంది ఉంటారో తెలుసా? కేవలం ముగ్గురే ఉంటారు. రోహిత్, అతని భార్య రితిక, కూతురు సమారియా ఉంటారు. కాగా.. చిన్నప్పుడు కుటుంబంతో కలిసి ఒకే గదిలో ఉండేవాడట రోహిత్. ఇప్పుడు స్టార్ క్రికెటర్ అయిన తర్వాత పేరు, హోదాతోపాటు డబ్బు, సకల సౌకర్యాలు సమకూరాయి. అన్నట్టూ.. ఈ ఇంటి విలువ ఎంతో తెలుసా? 30 కోట్ల రూపాయలు!