Begin typing your search above and press return to search.
మోడీని ప్రశ్నిస్తే అంతేమరీ.. 19 మంది ఎంపీలు ఔట్
By: Tupaki Desk | 26 July 2022 4:14 PM GMTదేశంలో ఇప్పుడు ‘మోడీ’స్వామ్యం నడుస్తోంది. మోడీని ఎదురించే మీడియా సైలెంట్ అయ్యింది. ప్రత్యర్థులపై ఈడీ, సీబీఐ కేసులు మోపడంతో వారంతా మౌనం దాల్చారు. అందుకే మోడీని ఎదురించేవారే లేకుండా పోతున్నారు. ఇక మోడీ సర్కార్ కు అంత బలం లేని రాజ్యసభలో మాత్రం ఈ ప్రశ్నించే గొంతుకలున్నాయి. రాజ్యసభలో మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రతిపక్ష ఎంపీలు నిరసనలతో హోరెత్తించారు. దీంతో రాజ్యసభలో 19 మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది.
మోడీ సర్కార్ హయాంలో ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంపై చర్చ జరపాలని రాజ్యసభ పోడియం ముందు విపక్ష ఎంపీలు ఆందోళనలు చేపట్టారు. వెల్ లోకి దూసుకొచ్చి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగింది. మోడీ సర్కార్ ను తీవ్రంగా ప్రశ్నిస్తున్నందుకు 19 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్లు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు. సభా కార్యక్రమాలను అడ్డుకొని నిబంధనలు ఉల్లంఘించింనందుకు వారం రోజుల పాటు సమావేశాలకు హాజరుకాకుండా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
సహజంగా పార్లమెంట్ లో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఎంపీల్లో బెంగాల్ కు చెందిన తృణమూల్ ఎంపీలు ముందుంటారు. ఇప్పుడూ వారే ఉన్నారు. కానీ ఈసారికి వీరికితోడుగా మన తెలంగాణకు చెందిన ముగ్గురు ఎంపీలు కదం తొక్కారు. ఇక వీరీకి డీఎంకే, సీపీఎం నుంచి ఒకరు చొప్పున రాజ్యసభలో కదంతొక్కి ఆందోళన చేశారు. దీంతో వీరిని సస్పెండ్ చేశారు.
తెలంగాణకు చెందిన ఎంపీలు బడుగు లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, దామోదరరావులు సస్పెండ్ అయ్యారు. ఈ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్షాలు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంపై ఉభయ సభల్లో నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు.
ఇక 5వేల మంది కశ్మీరీ వలసదారులకు ప్రభుత్వ ఉద్యోగాలు అందించినట్టు కూడా కేంద్రప్రభుత్వం తెలుపడం చర్చనీయాంవమైంది. ఇక 6వేల మంది కశ్మీరీ వలస ఉద్యోగుల కోసం కూడా అకామిడేషన్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఇక మోడీ సర్కార్ ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలు, కశ్మీర్ విషయంలో తీసుకున్న నిర్ణయాలపై ప్రతిపక్షాల గొంతు నొక్కేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రతిపక్షాలకు రాజ్యసభలో వాయిస్ లేకుండా చేస్తోంది. ప్రశ్నించే గొంతుక లేకుండా వారి వాదన ప్రజల్లోకి వెళ్లకుండా చూస్తోందన్న ఆరోపణలున్నాయి. మోడీని ప్రశ్నిస్తే ఇలా సస్పెండ్ చేస్తారా? అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.