Begin typing your search above and press return to search.

ఇంటి ముందు కూర్చుంటే.. మాస్కు పెట్టుకోలేదని మేకులు దించారు

By:  Tupaki Desk   |   27 May 2021 3:58 AM GMT
ఇంటి ముందు కూర్చుంటే.. మాస్కు పెట్టుకోలేదని మేకులు దించారు
X
విన్నంతనే వణుకు పుట్టే ఉదంతం ఒకటి ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు మాస్కు ముఖ్యమే అయినా.. కొన్ని సందర్భాల్లో అధికారులు.. పోలీసులు చేస్తున్న చేష్టలు షాకింగ్ గా మారాయి. ఆ కోవలోకే వస్తుంది తాజా ఉదంతం. యూపీలోని బరేలీలోని బరాదరీకి చెందిన ఒక వ్యక్తి ఇంటి ముందు కూర్చున్నాడు. అప్పుడు రాత్రి పది గంటలు. అంతలో స్థానిక పోలీసులు ఆ వీధిలోకి వచ్చారు. హడావుడి చేయటం షురూ చేశారు.

ఇంటి ముందు కూర్చున్న బాధితుడి వద్దకు వచ్చి మాస్కు ఎందుకు పెట్టుకోలేదని అడిగాడు. పోలీసుల దురుసు ప్రవర్తనతో పోలీసులకు.. కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో..ఆ వ్యక్తిని పోలీసులు తీసుకెళ్లారు. కట్ చేస్తే.. పక్కరోజు తెల్లవారుజామున తీవ్ర గాయాలతో ఇంటికి చేరారు. చేతికి.. కాలికి మేకులు దించిన వైనం షాకింగ్ గా మారింది.

దీంతో బాధితుడి కుటుంబం పోలీసులపై ఫిర్యాదు చేయటానికి ఉన్నతాధికారుల్ని కలిశారు. మే 24న జరిగిన ఈ ఉదంతం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ సంచలనంగా మారింది. మేకులు దించిన కాలు.. చేయి ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో ఈ ఉదంతంపై స్పందించారు ఎస్పీ రోహిత్ సజ్వాన్. బాధితుడిగా చెబుతున్న వ్యక్తిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని.. వాటి నుంచి తప్పించుకోవటానికే ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారని.. పోలీసుల తప్పేమీ లేదంటున్నారు. కానీ.. మేకులు దించిన ఫోటోలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.