Begin typing your search above and press return to search.

వారానికి మూడుసార్లు ఆస్పిరిన్ మాత్ర వేసుకుంటే!

By:  Tupaki Desk   |   20 Jan 2021 2:30 AM GMT
వారానికి మూడుసార్లు ఆస్పిరిన్ మాత్ర వేసుకుంటే!
X
వారానికి మూడుసార్లు ఆస్పిరిన్ మాత్ర వేసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్ మరణాల ముప్పు చాలా వరకు తగ్గుతుందని ఓ అధ్యయనం వెల్లడించింది. బ్రిటన్ కంట్రీలో ఆస్పిరిన్ మాత్ర తీసుకున్న మిలియన్ల మంది గుండె జబ్బుల నుంచి రక్షణ పొందారని ఆ అధ్యయనం పేర్కొంది. అంతేకాకుండా.. ప్రాణాంతక క్యాన్సర్లు అయిన బ్రెస్ట్ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్ల ముప్పు నుంచి కూడా ఈ మాత్ర ప్రొటెక్ట్ చేయగలదని నిరూపణ జరిగిందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ప్రతిరోజూ మిలియన్ల మంది తీసుకునే ఈ పెయిన్ కిల్లర్ ద్వారా గుండె జబ్బుల నుంచి రక్షణ పొందొచ్చని, ఇది రక్తాన్ని పలచబడేలా చేస్తుందని, తద్వారా రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుందని అధ్యయనంలో తేల్చారు. ఈ మాత్రలోని యాంటీ ఇన్ ఫ్లేమెంటరీ పదార్థాలతో బోవెల్ క్యాన్సర్ రిస్క్ ను కూడా తగ్గించగలదని పరిశోధకులు చెబుతున్నారు. అమెరికాలో 65ఏళ్ల వయస్సు ఉన్న 1,40,000 మంది పురుషులు, మహిళలపై దాదాపు 13ఏళ్ల పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ ట్రయల్ ద్వారా పరిశీలించి, ఈ ఫలితాలను వెల్లడించినట్టు పేర్కొన్నారు.

ఇక, బ్రిటన్ ట్రయల్ లో పాల్గొన్న వారికి ఆస్పిరిన్ 75mg డోస్ ఇచ్చారట. దీంతో.. ఆస్పిరిన్ టాబ్లెట్ వేసుకోనివారితో పోలిస్తే.. తీసుకున్నవారిలో 21శాతం నుంచి 25శాతం వరకు క్యాన్సర్లతో మరణించే ముప్పును తగ్గినట్టు నిర్ధారించారు. బ్రెస్ట్, బ్లాడర్ క్యాన్సర్లపై ఈ ఆస్పిరిన్ డ్రగ్ సమర్థవంతంగా పోరాడుతుందని తేల్చారు పరిశోధకులు.