Begin typing your search above and press return to search.
సింగిల్ డోసే కదా అని ఈ టీకా తీసుకన్నారంటే.. ఇక మీ పని అంతే!
By: Tupaki Desk | 6 May 2022 6:30 AM GMTకరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా ప్రతీ ఒక్కరూ టీకాలు తీస్కుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఆరోగ్య నిపుణులందరూ టీకానే శ్రీరామ రక్ష అని వివరిస్తున్నారు. అయితే చాలా మంది రెండు డోసుల టీకాలతో పాటు బూస్టర్ డోసు టీకాలను కూడా తీసుకున్నారు. అయితే చాలా మందికి టీకా తీసుకున్న తర్వాత జ్వరం రావడం, నొప్పి రావడం వంటివి జరగడంతో.. కరోనా టీకా అంటేనే భయంతో వణికిపోయారు. ఇప్పటికీ కొంత మంది ఒక్క డోసు టీకా కూడా తీసుకోలేరు.
మరికొందరేమో మొదటి డోసు టీకా తీసుకున్నప్పుడు వచ్చిన నొప్పి, జ్వరానికి భయపడి రెండో డోసు టీకా తీసుకోలేరు. ఇలా చాలా మంది తమ భయాల కారణంగా టీకాలకు దూరంగా ఉన్నారు. కానీ అమెరికాలో కరోనా వైరస్ నియంత్రణ కోసం ఇస్తున్న జాన్సన్ అండ్ జాన్సన్ కొవిడ్ వ్యాక్సిన్ పై చేసిన ఓ కీలక ప్రకటన చాలా మందిని ఆకర్షిస్తోంది. కేవలం ఒక్క డోసు టీకా తీసుకుంటే సరిపోతుందంటూ గతంలో తెలిపిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఒక్క డోసు టీకా అనే సరికి చాలా మంది ఆ వ్యాక్సిన్ పై ఆసక్తి కనబర్చారు కూడా.
కానీ ప్రస్తుతం జాన్సన్ అండ్ జాన్సన్ కొవిడ్ వేసుకున్న వారికి దుష్ప్రభావాలు ఎదురవుతున్నాయంటూ యూఎస్ ఏప్డీఏ స్పష్టం చేసింది. ఎఫ్డీఏ గతేడాది ఫిబ్రవరిలో 18 ఏళ్ల అంతంకంటే ఎక్కువ వయసు ఉన్న వారికి జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ ఇవ్వడానికి అనుమతినిచ్చింది. ఈ వ్యాక్సిన్ ను మొదట్లో మహమ్మారితో పోరాడడంలో ముఖ్యమైన సాధనంగా పరిగణించారు. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ డోసు ఒక్కటి మాత్రమే అవసరం. అదే పైజర్మో, డర్నా టీకాలు రెండు డోసులు వేసుకోవాల్సి ఉంది.
దీనికంటే సింగిల్ డోస్ బెస్ట్ అంటూ జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ ను ఎంపిక చేసుకున్నారు చాలా మంది. అయితే ఈ క్రమంలోనే అమెరికాలో ఇప్పటి వరకు 18 మిలియన్ల అమెరికన్లకు జాన్సన్ అండ్ జాన్సన్ కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ వ్యాక్సిన్ రక్తం గడ్డ కట్టడానికి కారణం అవుతుందని... ఆ వ్యాక్సిన్ పొందే వారి సంఖ్య పరిమితం చేయాలని సూచించింది. తక్కువ స్థాయి కంటే ప్లేట్ లెట్లతో కలిపి అరుదైన, ప్రాణాంతక రక్తం గడ్డకట్టే సిండ్రోమ్ అయిన థ్రోంబోసైట్ పెనియా సిండ్రోమ్(టీటీఎస్)తో థ్రాంబోసిస్ ప్రమాదం ఉందని ఎఫ్డీఏ నిర్ధారించింది.
ఈ వ్యాక్సిన్ ఇచ్చిన మొదటి రెండు వారాల్లో ఈ సమస్య ఏర్పడుతుందని.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి, కాలు వాపు, నిరంతర పొత్తి కడుపు నొప్పి, తల నొప్పి లేదా అస్పష్టమైన దృష్టి వంటి నాడీ, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. కొంత మందిలో వ్యాక్సిన్ తీసుకున్న చోట చర్మం కింద పెటెచియా అని పిలిచే ఎర్రటి మచ్చలు ఏర్పడ్డాయని యూఎస్ శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే 18 మిలియన్ల కంటే తక్కువ మంది ఆ వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.