Begin typing your search above and press return to search.

అమ్మో... ఆ నీటిని తాకితే రాయిగా మారిపోతారు!

By:  Tupaki Desk   |   3 May 2021 11:30 PM GMT
అమ్మో... ఆ నీటిని తాకితే రాయిగా మారిపోతారు!
X
శాపాలతో రాయిగా మారుతారు.. వరాలతో బంగారం పొందుతారు.. ప్రత్యేక శక్తులతో ఏది అనుకున్నా అది నెరవేరుతుంది ఇటువంటివి కథల్లో వింటాం. వాస్తవాలకు దూరం అని అనుకుంటాం. కానీ ఆ నీటిని తాకితే మాత్రం నిజంగా రాయిగా మారుతారు. అక్కడ ఇప్పటికే ఎన్నో జంతువుల, పక్షల కళేబరాలు తేలియాడుతూ ఉన్నాయి. ఇంతకీ ఆ డేంజర్ నీరు ఎక్కడో తెలుసా..?

ఆఫ్రికన్ దేశమైన ఉత్తర టాంజానియా నేట్రాన్ సరస్సు ఉంది. ఈ నీటిని తాకితే ఎవరైనా రాయిగా మారుతారు అని అంటున్నారు స్థానికులు. అందుకు నిదర్శనమే అక్కడ చెక్కు చెదరకుండా ఉన్నా జంతువులు, పక్షుల కళేబరాలని అని చెబుతున్నారు. ఈ ప్రమాదకరమైన సరస్సు పేరు వింటేనే అక్కడి వారు హడలిపోతారు. ఈ డేంజర్ నీటి గురించి ప్రపంచమంతా తెలుసుకోవాలని ఆసక్తి కనబర్చుతుంది.

శాస్త్రీయ దృక్కోణంలో ఈ సరస్సులోని నీటి ఆల్కలీన్ పీహెచ్ 10.5 కు సమానం. ఇది కాస్టిక్ గుణాన్ని కలిగి ఉంటుంది. ఈ నీటిని తాకిన వెంటనే జంతువుల చర్మం, కళ్లు కాలిపోతాయి. సోడియం కార్పొనేట్ ఇతర ఖనిజాల నుంచి క్షార గుణం కలిగిన నీరుగా మారుతుంది. చుట్టూ ఉన్నా కొండల నుంచి ప్రవహించి చివరకు ఉప్పు పరిమాణం ఎక్కువగా గల నీరుగా మారుతుంది.

ఈ నీటిలో సోడా, ఉప్పు పరిమాణం అధికంగా ఉండడం వల్ల చనిపోయిన జంతు కళేబరాలు చెక్కు చెదరకుండా ఉంటాయి. తూర్పు ఆఫ్రికాలో అంతరించిపోతున్న జంతువుల గురించి రాసిన అక్రోస్ ది రావేజ్డ్ ల్యాండ్‘ పుస్తకంలో ఈ సరస్సు గురించి ప్రస్తావించారు. 60 డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. అగ్ని పర్వతంలో కనిపించే మూలక గుణాలు కలిగి ఉంటుంది. పురాతన కాలంలో మమ్మీలను సురక్షితంగా ఉంచడానికి ఈ నీటినే ఉపయోగించేవారని సమాచారం.