Begin typing your search above and press return to search.

కాంతివంతమైన ముఖం కావాలా.. అయితే చెంప చెల్లుమనాల్సిందే!

By:  Tupaki Desk   |   3 Dec 2021 7:30 AM GMT
కాంతివంతమైన ముఖం కావాలా.. అయితే చెంప చెల్లుమనాల్సిందే!
X
అందమైన ముఖం కావాలనే కోరిక ఎవరికి ఉండదు చెప్పండి. సహజంగా ముఖవర్ఛసుతోనే యాభై శాతం ఆత్మవిశ్వాసం కలుగుతుందని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. అయితే ఇటీవల కాలంలో అమ్మాయిలు, మహిళలు, పురుషులు అందరూ కూడా అందంపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కాంతివంతమైన మొహం కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు. శనగపిండి, ముల్తానా మట్టి, పసువు వంటి సహజ పదార్థాలతో సింపుల్ టిప్స్ ఫాలో అవుతారు. కొందరు ఇళ్లలోనే కొన్ని సంప్రదాయ పద్ధతులు పాటిస్తే... మరికొందరేమో బొటాక్స్ ట్రీట్ మెంట్ వంటివి అనుసరిస్తారు.

నిగారింపైన ముఖం కోసం మాత్రం ఓ పార్లర్ లో భిన్నమైన పద్ధతులు ఉన్నాయట. మంచి ముఖ వర్ఛస్సు కోసం అక్కడ చెంప చెల్లుమనిపిస్తారట. చెంప దెబ్బలు కొట్టడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుందని అక్కడి వారు చెబుతున్నారు. అయితే ఈ కొట్టడం ఇష్టారీతిన కాదని... అందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయని అంటున్నారు. ముఖం మీద కొట్టే దెబ్బలను నిర్ణిత సమయంలో తగు గ్యాప్ ఇస్తూ కొడతారట. అలా అయితేనే ముఖం అందంగా తయారవుతుందట.

ఈ చెంపదెబ్బల పార్లర్లు దక్షిణా కొరియాలో ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడ చాలామంది ఈ పార్లర్లలోనే ట్రీట్ మెంట్ చేయించుకుంటారు. ముఖంపై రోజుకు 50 దెబ్బలు కొడితే స్కిన్ చాలా షైన్ అవుతుందట. దెబ్బల వల్ల రక్తప్రసరణ బాగా జరిగి.. ముఖం కాంతివంతంగా మారుతుందట. అంతేకాకుండా మొహంలోని ఉన్న ఎముకలు సర్దుబాటు జరిగి మంచి షేప్ వస్తుందట. ఈ థెరపీతో చాలా ఉపయోగాలు ఉన్నాయని అక్కడి యువతులు నమ్ముతున్నారు.

ఈ చెంప చెల్లుమనే ట్రీట్ మెంట్ సింగిల్ సిట్టింగ్ లో పూర్తి కాదు. ఒక్కొక్కరి చర్మతత్వం, వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి దశలవారీగా సిట్టింగ్స్ ఉంటాయట. ఎవరికి ఎంతమోతాదులో అవసరం ఆ విధంగా చేస్తారట. తొలుత మహిళలకే పరిమితమైన ఈ వింత బ్యూటీ కేర్... ఆ తర్వాత పురుషులకు కూడా అందుబాటులోకి వచ్చిందట. అయితే ప్రస్తుతం ఈ చెంప చెల్లుమనే థెరపీ ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ థెరపీ కథనాలకు... నెటిజన్ల నుంచి భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి.