Begin typing your search above and press return to search.
మొబైల్ లో మీ పిల్లలు వాటిని చూస్తే.. పేరెంట్స్ పై కేసుల నమోదు
By: Tupaki Desk | 4 July 2021 3:38 AM GMTరోనా మహమ్మారి ఆరోగ్య.. ఆర్థిక సమస్యల్ని మాత్రమే కాదు.. సరికొత్త సమస్యల్ని ఎన్నింటినో తీసుకొచ్చింది. ఇంతకాలం లేని కొత్త చిక్కులతో సతమతమయ్యేలా చేస్తోంది. లాక్ డౌన్ పుణ్యమా అని.. ఆన్ లైన్లో క్లాసులు నడుస్తుండటంతో ప్రతి విద్యార్థికి అయితే మొబైల్ లేదంటే ల్యాప్ టాప్ ఇస్తున్నారు. దీంతో.. ఆన్ లైన్ లో పాఠాలు వినే పేరుతో.. బూతు వీడియోల్ని చూస్తున్న వైనం ఎక్కువైనట్లు చెబుతున్నారు.
దేశ వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి ఉన్నా.. కర్ణాటకలో మాత్రం ఇది మరింత ఎక్కువగా ఉన్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. బూతు వీడియోల్లో పిల్లల పోర్న్ చూడటం నేరమన్న విషయం తెలిసిందే. అనూహ్యంగా విద్యార్థులు పెద్ద ఎత్తున పిల్లల పోర్న్ ను ఎక్కువగా చూస్తున్నట్లు చెబుతున్నారు. ఈ వైనం ఆందోళనకు గురి చేస్తోంది. గత ఏడాది పిల్లలు.. టీనేజర్లు మాత్రమే కాదు.. పెద్దలు కూడా పిల్లల బూతు వీడియోల్ని చూస్తున్నట్లుగా కర్ణాటక సైబర్ పోలీసులు చెబుతున్నారు.
పిల్లల పోర్న్ వీడియోల్ని చూస్తున్నట్లుగా తేలితే.. సమాచార సాంకేతిక చట్టం 67బీ ప్రకారం కేసు నమోదు చేస్తారు. అందుకు బాధ్యులైన వారిని అరెస్టు చేస్తారు కూడా. పిల్లల పోర్న్ చూసే వారికి గరిష్ఠంగా ఐదేళ్లు జైలుశిక్ష తోపాటు రూ.10లక్షలు జరిమానాను విధిస్తారు. అదే నేరాన్ని రెండోసారి చేసిన పక్షంలో ఏడేళ్లు జైలు.. రూ.10 లక్షలు ఫైన్ విధిస్తారు. అదే సమయంలో పెద్దల అశ్లీల వీడియోలు చూసే వారికి మూడేళ్లు జైలు.. రూ.10లక్షలఫైన్ విధిస్తారు. ఇదే తప్పు చేస్తూ రెండోసారి పట్టుబడితే ఏడేళ్ల జైలు.. రూ.10లక్షల ఫైన్ వేస్తారు.
లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం కావటం.. పెద్దగా పని లేకపోవటంతో.. ఎక్కువగా ప్రైవసీ దొరకటంతో పలువురు తమకు తోచినట్లుగా వ్యవహరిస్తున్నట్లుగా గుర్తించారు. కర్ణాటకలో పిల్లలతో పాటు పెద్దలు కూడా పోర్న్ చూడటం ఎక్కువైందన్న విషయాన్ని గుర్తించారు. ప్రత్యేక సాంకేతికతతో పోర్న్ వీడియోలు చూసే వారిని సీఐడీ పోలీసులు గుర్తించినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే ఇలాంటి తప్పులు చేసిన 200 మందిని అధికారులు విచారించారు. వారు ఏ మొబైల్ నుంచి ఈ తరహా వీడియోల్ని చూశారన్నది గుర్తించి వార్నింగ్ ఇచ్చి వదిలేశారు.
ఈ సందర్భంగా పిల్లలు చూసే వీడియోలకు పెద్దలు కూడా బాధ్యులవుతారని అధికారులు పేర్కొనటం ఇప్పుడో సమస్యగా మారింది. చిన్నపిల్లల అశ్లీల వీడియోల్ని పిల్లలు కానీ వీక్షిస్తే.. వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేసి.. అరెస్టు చేస్తామంటున్నారు. సో.. ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు. వారి మొబైల్ లో ఏం చూస్తున్నారన్న దానిపై పెద్దలు ఒక కన్నేసి చూడాల్సిన పరిస్థితి. కర్ణాటకలో అమలు చేస్తున్న ఈ విధానం రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తే.. ఎన్ని వందల కేసులు బుక్ అవుతాయో?