Begin typing your search above and press return to search.

మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా? ఇది తప్పక చదవాల్సిందే

By:  Tupaki Desk   |   13 May 2020 11:30 PM GMT
మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా? ఇది తప్పక చదవాల్సిందే
X
మాయదారి రోగంతో ప్రపంచ ప్రజలంతా హాహాకారాలు చేస్తున్నారు. కాస్తంత దగ్గితే చాలు.. వణికిపోతున్న పరిస్థితి. ఇక.. జ్వరం ఉందన్న నోటి మాటతోనే ఆమడ దూరానికి పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే అందరికి మాయదారి రోగ లక్షణాలు అర్థమైన వేళ.. ఇప్పుడీ పిశాచి సరికొత్త తీరును ప్రదర్శిస్తున్నట్లు గుర్తించారు.
పెద్దోళ్లకు ఒకలా.. చిన్నారుల్లో మరోలా తన ప్రభావాన్ని చూపిస్తున్నట్లు చెబుతున్నారు. తాజాగా విడుదలైన అధ్యయనం ప్రకారం.. మీ ఇంట్లో పిల్లలు రోటీన్ కు భిన్నంగా కనిపిస్తే అనుమానించాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. మాయదారి రోగం బారిన పడిన చిన్నారుల్లో కొత్త తరహా లక్షణాలు కనిపిస్తున్నట్లు చెబుతున్నారు.

పిల్లలు ఎవరైనా తాము గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు చెప్పినా.. ఒకవేళ వారు చెప్పలేకున్నా.. మీ వరకూ అలాంటి లక్షణాలు కనిపించినా.. వెంటనే అలెర్టు కావాల్సిన అవసరం ఉంది. దీనికి తోడు.. విరేచనాలు.. జ్వరం లాంటివి వస్తే మాత్రం డేంజర్ జోన్ లోకి వెళ్లినట్లేనని చెప్పక తప్పదు.

పెద్దోళ్లకు దగ్గు.. తమ్ములు.. జలుబు లక్షణాలతో మొదలు కాకుండా పిల్లల విషయంలో మరోలా విరుచుకుపడుతున్న మహమ్మారి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. పిల్లల్లో శ్వాస సంబంధిత సమస్యలు లేకున్నా.. నిమోనియాతోపాటు గ్యాస్ట్రో ఇంటెస్టనల్ లక్షణాలతో ఇబ్బంది పడుతుంటే.. వైద్యుల్ని సంప్రదించాల్సిన అవసరం ఉందంటున్నారు.