Begin typing your search above and press return to search.
మోడీ ఆఫీసు మీద సీబీఐ దాడి చేస్తే..!
By: Tupaki Desk | 16 Dec 2015 12:48 PM GMTవిషయం ఏదైనా కావొచ్చు.. స్పందించే విషయంలో సెలబ్రిటీలు మొదలుకొని సామాన్యుల వరకూ చాలానే మార్పు వచ్చింది. గతంలో ఏదైనా విషయం మీద స్పందించాల్సి వస్తే ప్రముఖులు ఆచితూచి మాట్లాడేవారు. ఇక.. సామాన్యుల విషయానికి వస్తే.. వారి మాటకు విలువ ఇచ్చి.. ప్రముఖంగా చెప్పే మీడియానే ఉండేది కాదు. సోషల్ మీడియా పుణ్యమా అని పరిస్థితులు మొత్తం మారిపోయాయి. విషయం ఉండాలే కానీ.. మాట ఎవరిదైనా కానీ.. తూటాలా పేలే పరిస్థితి వచ్చేసింది.
ఇక.. ప్రముఖులు.. సెలబ్రిటీలు సైతం గతంలో మాదిరి మడికట్టుకొని కూర్చునే రోజులు పోయాయి. తమ మనసులోని భావాల్ని బయటకు చెప్పేందుకు పెద్దగా మొహమాటపడటం లేదు. సోషల్ మీడియాలో తాము చేసిన వ్యాఖ్యల కారణంగా వివాదాస్పదమైనప్పటికీ.. వారు తాము చెప్పాలనుకున్నది చెబుతున్నారేకానీ.. వెనక్కి తగ్గటం లేదు. ఇదిలా ఉంటే.. గత రెండు రోజులుగా ఒక అంశం హాట్ టాపిక్ గా మారింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేంద్రకుమార్ కార్యాలయం.. ఇంటి మీదా సీబీఐ దాడులు చేయటం.. అవినీతి అంశంపై సోదాలు చేసిన నేపథ్యంలో.. బీజేపీ.. ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాజకీయ పార్టీల మధ్య మాటలు ఒకరకంగా పేలితే.. సోషల్ మీడియాలో ఇదే అంశంపై జో్కులు ఓ రేంజ్ లో పేలుతున్నాయి.
మొన్నామధ్య హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఇంటి మీదా.. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆపీసు మీదా సీబీఐ సోదాలు చేసిన నేపథ్యంలో.. ప్రముఖుల కార్యాలయాల్లోనూ.. ఇళ్లల్లోనూ సోదాలు జరిపితే ఏం దొరుకుతాయో ఊహిస్తూ.. కాస్తంత కామెడీ వ్యాఖ్యలు చేశారు. ఇవి.. హాస్యాన్ని పండించటంతోపాటు.. వారిపై ఉన్న విమర్శల్ని చెప్పకనే చెప్పేస్తున్నాయి.
ఆ ట్వీట్స్ చూస్తే..
+ మోడీ ఆఫీసుపై దాడి చేస్తే.. మూడేళ్లకు సంబంధించిన విదేశీ యాత్రల టిక్కెట్లు.. అక్కడ నిర్వహించే కార్యక్రమాల ఈవెంట్ మేనేజ్ మెంట్ ప్లాన్లు దొరికేస్తాయ్.
+ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇంటిపై సీబీఐ దాడి చేసేందుకు ఇంటికి వెళితే.. అమ్మ స్టిక్కర్లు అతికించి పంపుతారు.
+ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఇంటిపై దాడి చేస్తే బోలెడన్ని డిగ్రీలు ఖాయం.
+ కేంద్రమంత్రి వీకే సింగ్ ఇంటి మీద సీబీఐ రైడ్ చేస్తే బోలెడన్ని బర్త్ సర్టిఫికేట్లు దొరుకుతాయి.
+ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి మీద దాడి చేస్తే.. డ్రైవర్ లెస్ కారు దొరుకుతుంది.
+ అమీర్ ఖాన్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తే అసహనంపై స్క్రిప్టులు.. ఇంటి వెనకాల టాంకు నిండి మొసలి కన్నీళ్లు దొరుకుతాయి.