Begin typing your search above and press return to search.
నిమ్మగడ్డ మరో కీలక నిర్ణయం
By: Tupaki Desk | 26 Jan 2021 2:02 PM GMTఏపీలో పంచాయితీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఇప్పటికే ఉన్నతాధికారులను బదిలీ చేసిన నిమ్మగడ్డ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నిన్న చెప్పినట్టుగానే ఎన్నికల అక్రమాలకు అడ్డుకట్టే వేసేందుకు ఐజీ స్థాయి అధికారిని నియమిస్తూ ఇవాళ నిమ్మగడ్డ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐజీ సంజయ్ కు బాధ్యతలు కూడా అప్పగించారు. ఆయన వెంటనే విధుల్లో చేరి ఏపీ సర్కార్ కు షాకిచ్చారు.
గత ఏడాది స్థానిక సంస్థల ఎన్నికల్లో హింస, దాడులు, బెదిరింపులు చోటుచేసుకున్నాయి. కొన్నింటిని బెదిరింపులతోనే ఏకగ్రీవాలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. వాటికి అడ్డుకట్ట వేసేందుకే ప్రత్యేక అధికారిని నియమిస్తానని నిమ్మగడ్డ ప్రకటించారు. ఈరోజు ఐజీ సంజయ్ కు నియంత్రణ బాధ్యతను అప్పగించారు.
ప్రస్తుతం ఐపీఎస్ సంజయ్ ఐజీపీగా కొనసాగుతున్నారు. ఆయన నిమ్మగడ్డను కలిసి చార్జ్ తీసుకున్నారు. ఏకగ్రీవాల విషయంలో అక్రమాలు బెదిరింపులను అడ్డుకునేందుకు సంజయ్ పర్యవేక్షించనున్నారు.ఈరోజు సెలవు రోజైనప్పటికీ సంజయ్ బాధ్యతలు స్వీకరించడం విశేషం. రేపటి నుంచి ఆయన ఏపీలో రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. సంజయ్ ను నేరుగా నియమించి ఏపీ సర్కార్ కు నిమ్మగడ్డ జలక్ ఇచ్చినట్టైంది.