Begin typing your search above and press return to search.

కరోనావైరస్: ఐఐటి మరో అద్భుత సృష్టి..ఏంటంటే!

By:  Tupaki Desk   |   11 April 2020 9:10 AM GMT
కరోనావైరస్: ఐఐటి మరో అద్భుత సృష్టి..ఏంటంటే!
X
కరోనా మహమ్మారి మొత్తం ప్రపంచాన్ని వణికిస్తుంది. దీనితో కనీసం బయట ఎవరితో మాట్లాడాలి అన్నా - అలాగే బయటకి వెళ్లి ఎవరైనా కిరాణా సామాన్లు కానీ - కూరగాయలు కానీ - పాల పాకెట్స్ కానీ తీసుకోని ఇంట్లోకి రావాలంటేనే చాలామంది భయంతో వణికిపోతున్నారు. ఈ తరుణంలో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) అతినీల లోహిత జెర్మిసైడల్ రేడియేషన్ టెక్నాలజీ తో అమర్చిన ట్రంక్ ఆకారపు పరికరాన్ని అభివృద్ధి చేసింది. దీని ద్వారా కిరాణా సామాన్లు మరియు కరెన్సీ నోట్లతో సహా బయటి నుండి తీసుకువచ్చిన అన్ని వస్తువులను శుభ్రపరచు కోవచ్చు.

ఐఐటి రోపర్ బృందం తెలిపిన ప్రకారం వాణిజ్యీకరించబడిన ట్రంక్ రూ.500 కన్నా తక్కువకు లభిస్తుంది. పరికరాలను శుభ్రపరచడానికి 30 నిమిషాలు పడుతుంది. వస్తువులను బయటకు తీసే ముందు 10 నిమిషాల శీతలీకరణలో ఉంచాలని బృందం తెలిపింది. చాలా మంది కూరగాయలను వాడే ముందు వెచ్చని నీటితో శుభ్రపరుస్తారు. కానీ కరెన్సీ నోట్లు లేదా పర్సులను అలా చేయలేమని ఐఐటి రోపర్ సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ నరేష్ రాఖా పిటిఐకి చెప్పారు. కాబట్టి తాము అన్నింటికీ సాధారణ పరిశుభ్రత పరిష్కారాన్ని కొనుగొన్నామని తెలిపారు.

బయటి నుంచి వచ్చే కరెన్సీ నోట్లు - కూరగాయలు - మిల్క్ ప్యాకెట్లు మరియు డెలివరీ ద్వారా ఆర్డర్ చేయబడిన వస్తువులు - రిస్ట్ వాచ్ - వాలెట్లు - మొబైల్ ఫోన్లు లేదా ఏదైనా పత్రాలను ఉపయోగించటానికి ముందు ట్రంక్‌ లో ఉంచాలని - ఆలా చేస్తే ఆ వస్తువులపై ఉండే క్రిములు పూర్తిగా మాయమైపోతాయని తెలిపారు. అలాగే మరో ముఖ్యమైన విషయం కూడా చెప్పారు ... ఈ పరికరం వాటర్ ప్యూరిఫైయర్లలో ఉపయోగించే అతినీల లోహిత జెర్మిసైడల్ రేడియేషన్ టెక్నాలజీ పై ఆధార పడిందని, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రంక్ లోపల ఉన్న కాంతిని నేరుగా చూడవద్దని తెలిపారు. ఇకపోతే , దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 6,412 కేసులు నమోదుకాగా .. మరణించిన వారి సంఖ్య 199 కు పెరిగింది.