Begin typing your search above and press return to search.

ఐఐటీ స్టూడెంట్ సన్యాసుల్లో కలిసిపోయింది

By:  Tupaki Desk   |   20 Jan 2016 9:21 AM GMT
ఐఐటీ స్టూడెంట్ సన్యాసుల్లో కలిసిపోయింది
X
ఐఐటి మద్రాస్ లో ఇంజినీరింగ్ డిజైన్ లో ఎమ్ ఎస్ చేస్తున్న ఒక విద్యార్థిని సన్యాసిని కావాలన్న ఆకాంక్షతో హిమాలయాలకు బయలుదేరింది. ఈ మేరకు తన హాస్టల్ రూం లో ఒక లేఖను వదలి వెళ్లింది. ఆధ్యాత్మిక జీవనం గడపాలనే లక్ష్యంతో తానీ నిర్ణయం తీసుకున్నట్లు ఆ లేఖలో పేర్కొంది. 26 ఏళ్ల వేదాంతం ఎల్. ప్రత్యూష అనే విద్యార్థిని తన మరింత ఆధ్మాత్మిక జ్ణానాన్ని సముపార్జించేందుకు హిమాలయాలకు వెళుతున్నానని పేర్కొంటూ రెండు లేఖలను తన హాస్టల్ గదిలో వదిలి గత ఆదివారం హాస్టల్ విడిచి వెళ్లింది.

తాను సన్యాసిని కావాలనునకుంటున్నాననీ, తనను దేవుడు ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటాడనీ పేర్కొంది. తన కుటుంబ సభ్యులు సహా ఎవరూ తనెక్కడున్నానన్నది ఎన్నటికీ తెలుసుకోలేరని కూడా ఆ లేఖలో పేర్కొన్నట్లు మీడియా కథనం. హాస్టల్ వీడి వెళ్లే ముందు నిబంధనల ప్రకారం ఆమె దరఖాస్తు చేసి, ఈ నెల 20న తిరిగి వస్తానని పేర్కొంది. అయితే ఆమె తన స్వస్థలమైన గుంటూరు చేరుకోకపోవడంతో ఆమె తల్లిదండ్రులు సంబంధిత అధికారులను కలిశారు.దీంతో విషయం వెల్లడైంది. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అయితే.... విద్యార్థిని హిమాలయాలకే వెళ్లిందా లేదంటే ఆమె కనిపించకపోవడం వెనుక ఇంకేదైనా కారణం ఉందా అన్న అనుమానాన్ని పోలీసులు వ్యక్తంచేస్తున్నారు.