Begin typing your search above and press return to search.
గుడ్ న్యూస్ చెప్పిన ఐఐటి సీనియర్ ప్రొఫెసర్.. డిసెంబర్ నాటికి హెర్డ్ ఇమ్యూనిటీ !
By: Tupaki Desk | 17 May 2021 1:09 PM ISTదేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. అయితే , గత కొద్ది రోజులుగా దేశంలో నమోదు అయ్యే పాజిటివ్ కేసులు సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఇది ఓ శుభపరిణామం అయితే , డిసెంబరు నాటికి దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీకి అవకాశం ఉంటుందని సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి, ఐఐటి కాన్పూర్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ అశుతోష్ శర్మ మరో గుడ్ న్యూస్ చెప్పారు. అప్పటికి జనాభాలో 60 నుండి 70% మందికి ప్రతిరోధకాలు అభివృద్ధి చెందుతాయని , ఇది కరోనా వైరస్ వ్యాప్తిలోని వేగాన్ని గణనీయంగా తగ్గిస్తుందని అన్నారు. అంతా పక్కా ప్రణాళికతో ముందుకిసాగితే దేశం త్వరలోనే ఈ కరోనా రక్కసిని ఓడిస్తుందని శర్మ అంటున్నారు. ఈయన చెప్పిన దాని ప్రకారం .. వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా ఇంకా కొద్ది రోజులు పేస్ మాస్క్ లు పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం, వైరస్ వివిధ మార్పులను చూపిస్తోంది. ఈ దశలో, నిపుణులు, ప్రణాళిక కమిటీ దీనిని ఊహించలేకపోయరు. అందుకే సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారింది.
ఇప్పుడు మనమందరం భవిష్యత్తు కోసం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని , మన ప్రవర్తనపై మన భవిష్యత్తు చాలా వరకు ఆధారపడి ఉంటుందని , మాస్క్, సామాజిక దూరం, టీకా ఈ మూడు ఇప్పుడు మనకు రక్షణ కవచాలు. వీటిని అశ్రద్ధ చేయకూడదని అన్నారు. ఎన్ని కొత్త వేరియంట్లు వచ్చినా కూడా వ్యాక్సిన్లు బాగా పని చేస్తాయని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ భయం లేకుండా టీకాలు వేయించుకోవాలని అయన సూచించారు. ఇది ప్రమాద రేటును గణనీయంగా తగ్గిస్తుంది అదేవిధంగా సంక్రమణ ప్రసారాన్ని కూడా నిరోధిస్తుంది అని శర్మ వివరించారు.
ఇక ఇదిలా ఉంటే .. దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య చాలా రోజుల తర్వాత మూడు లక్షల కన్నా తక్కువగా నమోదైంది. నిన్న కొత్తగా 2,81,386 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం నిన్న 3,78,741 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,49,65,463కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 4,106 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,74,390కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,11,74,076 మంది కోలుకున్నారు. 35,16,997 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 18,29,26,460 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటి వరకు మొత్తం 2.46 కోట్ల మంది ప్రజలు కరోనా బారిన పడ్డారు. వీరిలో 2.07 కోట్ల మంది బయటపడ్డారు. 2.70 లక్షల మంది రోగులు మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 36.13. అదేవిధంగా.. కరోనా నుండి కోలుకుంటున్న వారి సంఖ్య నిరంతరం పెరుగుతుండటం కూడా ఉపశమనం కలిగించే విషయం.