Begin typing your search above and press return to search.

వైశ్యుల‌ను మ‌రో మాట అనేసిన ఐల‌య్య‌!

By:  Tupaki Desk   |   9 Oct 2017 7:00 AM GMT
వైశ్యుల‌ను మ‌రో మాట అనేసిన ఐల‌య్య‌!
X
ఈ దేశంలో అంద‌రికి భావ‌స్వేచ్ఛ ఉంది. అలా అని న‌చ్చ‌నోళ్ల అంద‌రిని ఇష్టారాజ్యంగా తిట్టేస్తూ.. పిడి వాద‌న‌తో అడ్డ‌దిడ్డంగా పుస్త‌కాలు రాసేస్తేయొచ్చా? అంటే.. నో.. నెవ్వ‌ర్ అనేస్తారు ప్ర‌జాస్వామ్య‌వాదులు. రాజ్యాంగం భావ‌స్వేచ్ఛ ఇచ్చిందే కానీ.. మ‌న‌సుకు తోచిన‌ట్లుగా ఎవ‌రి మీద ప‌డితే వారి మీద విషం చిమ్మ‌మ‌ని చెప్ప‌లేదు.

ఈ చిన్న పాయింట్ కంచె ఐల‌య్య లాంటి మేధావికి.. ఆయ‌న్ను వెన‌కేసుకొచ్చే వామ‌ప‌క్షవాదుల‌కు ఎందుకు అర్థం కాద‌న్న‌ది అర్థం కానిది. కులాల మీద చిచ్చు పెట్టేలా.. కులాల్ని అవ‌మానించేలా పుస్త‌కాలు రాయ‌టం మేధావి అయిన ఐల‌య్య‌కు త‌గునా? అంటూ ఆయ‌న సూటిగా స‌మాధానం చెప్ప‌రు.

త‌మ‌నే కాదు.. త‌మ తాత ముత్తాతల్ని సైతం తిట్టిపోసేలా.. త‌మ ఆహార అల‌వాట్ల‌ను ఎగ‌తాళి చేసేలా పుస్త‌కం రాస్తే.. దాని మీద నిర‌స‌న చేస్తున్న వారిని అడ్డుకుంటున్న ప్ర‌భుత్వాలు.. ఈ ర‌చ్చ‌కు కార‌ణ‌మైన ఐల‌య్య మీద ఒక్క మాట కూడా మాట్లాడ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.

త‌మ‌ను దారుణంగా అవ‌మానించేలా భాష‌ను వాడుతూ పుస్త‌కం రాసిన ఐల‌య్య‌పై తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు వైశ్యులు. త‌మ‌ను కోమ‌ట్లు అన‌టం చిన్న‌బుచ్చ‌ట‌మేన‌ని చెప్పినా.. ఆ వ‌ర్గానికి మంచేలా కోమ‌ట్లు.. కోమ‌ట్లు అంటూ మాట్లాడ‌టం చూసిన‌ప్పుడు ఐల‌య్య ఆలోచ‌న‌లు ఏందో అర్థ‌మైపోతాయి.

తాజాగా.. ఐల‌య్య పుస్తకం మీద ఆగ్ర‌హంతో కొంద‌రు వైశ్యులు ఆయ‌న ఇంటికి బ‌య‌లుదేరారు. ఈ విష‌యాన్ని గుర్తించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకొన్నారు. ఐల‌య్య రాసిన కోమ‌టోళ్లు సామాజిక స్మ‌గ్ల‌ర్లు పుస్త‌కంపై చ‌ర్చ జ‌ర‌ప‌టానికి ఇంటికి వ‌స్తాన‌ని ఆర్య‌వైశ్య సంఘం నాయ‌కుడు శ్రీనివాస్ గుప్తా ప్ర‌క‌టించారు.

దీంతో.. ఉస్మానియా వ‌ర్సిటీ ద‌గ్గ‌ర పోలీసులు భారీగా మొహ‌రించారు. ఐల‌య్య ఇంటికి చేరుకుంటున్న శ్రీనివాస్ గుప్తా అండ్ కోను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలా ఉంటే.. త‌న పుస్త‌కంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసే వారికి మ‌రింత మండిపోయే మాట‌ల్ని మాట్లాడారు కంచె ఐల‌య్య‌. త‌న పుస్త‌కం జాతీయ‌స్థాయి అని.. దానిపై చ‌ర్చ జ‌ర‌పాలంటే జేఎన్ యూలో చ‌ర్చించాలే త‌ప్ప‌.. పుస్త‌కాలు చింపి పొట్లాలు క‌ట్టుకునే వారితో చ‌ర్చించేది లేద‌ని వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం.

ఎవ‌రైనా త‌న మాట‌ల కార‌ణంగా కానీ చేత‌ల కార‌ణంగా కానీ వేద‌న చెందిన‌ట్లు తెలిస్తే..అయ్యో అనుకోవ‌ట‌మే కాదు.. మిమ్మ‌ల్ని హ‌ర్ట్ చేయాల‌న్న‌ది నా ఉద్దేశం కాదంటూ వివ‌ర‌ణ ఇవ్వ‌టం క‌నిపిస్తుంది. కానీ.. ఒక జాతిని చిన్న‌బుచ్చేలా పుస్త‌కం రాసి.. దాని మీద చ‌ర్చ‌కు ఇంటికి వ‌స్తానంటే.. పొట్లాలు క‌ట్టుకునే వారితో మాట్లాడ‌న‌ని అన‌టంలో అర్థం ఉందా? అన్న‌ది ప్ర‌శ్న‌. ఒక‌వేళ పొట్లాలు క‌ట్టుకునే వారి స్థాయి ఉన్న వారితో త‌న‌కు మాట‌లేంద‌న్న భావ‌నే ఐల‌య్య‌కు ఉంటే.. అలాంటి స్థాయి ఉన్న జాతి మీద పుస్తకం ఎందుకు రాసిన‌ట్లు? అన్న ప్ర‌శ్నకు స‌మాధానం చెబితే బాగుంటుంది. ఇప్ప‌టికే రాత‌లో లేనిపోని ఆందోళ‌న‌ల్ని సృష్టించిన ఐల‌య్య‌..తాజాగా త‌న మాట‌ల‌తో మ‌రింత మంటెక్కేలా మాట్లాడ‌టం దేనికి నిద‌ర్శ‌నం? దీనిపై బాధ్య‌త క‌లిగిన ప్ర‌భుత్వాలు ఎందుకు స్పందించ‌టం లేదు?