Begin typing your search above and press return to search.
ఒక్క దెబ్బ బ్యాంకులకు దిమ్మ తిరిగిపోయింది!
By: Tupaki Desk | 10 May 2015 11:17 AM GMTతూర్పు యూరప్ దేశం మోల్డోవాలో ఒక వ్యక్తి సినిమాలో హీరోలు కాజేసినంత ఈజీగా బ్యాంకుల్లో సొమ్మును కాజేశాడు. అలా అని ఒక టీం, వళ్లకు బ్లాక్ డ్రెస్సులు, చేతికి గ్లౌజ్ లు, ముఖానికి మాస్క్లూ... ఇలాటి సెటప్ ఏమీ లేదు! ఇంట్లో కూర్చుని చేశాడు, సాక్ష్యాలు సంపాదించడానికి దేశంలోని మెధావుల సాయం తీసుకుంటున్నారు బ్యాంక్ సిబ్బంది! ఈస్థాయిలో మూడు బ్యాంకులను బురిడీ కొట్టించిన ఈ 28 ఏళ్ల ఐలాన్ షోర్ అనే నామదేయుడు కొల్లగొట్టింది ఎంతో తెలుసా? 100 కోట్ల డాలర్లు... అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 6400 కోట్ల రూపాయలు! నెంబర్ పెద్దదిగా ఉండటమే కాదు... ఆ దేశ జీడీపీలో ఇది 12 శాతం! ఈ స్థాయి లో మనోడు బ్యాంకులను నిండా ముంచేశాడు! మరో విశేషం ఏమిటంటే... బ్యాంకులు ఇంత సొమ్మును పోగొట్టుకున్నా... ఇతడిపై చర్యలు తీసుకోలేకపొతున్నాయి, పోలీసులు అధికారికంగా అరెస్టు చేయలేకపోతున్నారు! ఎందుకంటే... ఆ దేశ బ్యాంకులకు, పోలీసు అధికారులకు కూడా అర్థం కావడం లేదట, ఈ షోర్ అంత డబ్బు ఎలా కొట్టేశాడో అని!
ఆఖరికి ప్రపంచ ఆర్ధిక విచారణ కన్సెల్టెన్సీ క్రోల్ సాయం తీసుకున్న ఈ బ్యాంక్ అధికారులు ఐలాన్ షోర్ చేసిన మోసం తీరుని నివేదిక రూపంలో అందించారు!
ముందుగా మోల్డోవాలోని మూడు బ్యాంకుల నుంచి కంట్రోలింగ్ వాటా కొనుగోలు చేశాడు. అనంతరం ఆ బ్యాంకుల లిక్విడిటీని పెంచేలా పలు సంక్లిష్టమైన లావాదేవీలు నిర్వహిస్తూ పలు విదేశీ కంపెనీలకు రుణాలు ఇప్పించాడట! ఇంతకూ రుణాలు తీసుకున్న ఆ విదేశీ కంపెనీలన్నింటిలోనూ షోర్‌కు వాటాలున్నాయట! వీటికి సంబందించిన సాక్ష్యాలు దొరక్కుండా చాలా డేటా డిలీట్ చేశారని, రికార్డులు తీసుకుపోతున్న వ్యాన్‌ని తగలబెట్టారని నివేదికలో చెప్పుకొస్తున్నారు అధికార్లు! ఇందులో భాగంగానే మూడు రోజుల్లో 100 కోట్ల డాలర్ల సొమ్ముని కాజేశాడు. ఇది ఇలా ఉంటే మూడు రోజుల్లో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు కాజేసిన షోర్‌ను ఆ దేశ పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని షోర్ చెబుతున్నాడు!