Begin typing your search above and press return to search.

లాక్‌ డౌన్ పాస్ తీసుకొని..వివాహేతర సంబంధం కొనసాగింపు!

By:  Tupaki Desk   |   25 April 2020 2:30 AM GMT
లాక్‌ డౌన్ పాస్ తీసుకొని..వివాహేతర సంబంధం కొనసాగింపు!
X
కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు నెల రోజులుగా లాక్‌ డౌన్‌ ను అమలు చేస్తున్నాయి. దీంతో ప్రజలు అత్యవసర సమయాల్లో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు మాత్రమే బయటకు వస్తున్నారు. అది కూడా 3 కిలో మీటర్ల పరిధిలోనే. అయితే దూర ప్రయాణాలకు అత్యవసరమైతే పాస్ సౌకర్యం కల్పించారు. ఉద్యోగం లేదా నిత్యావసర వస్తువులు సరఫరా చేసే వారికి కొంతమందికి కూడా పాస్ ఇస్తున్నారు. కానీ లాక్ డౌన్ పాస్‌ ను కొంతమంది మిస్ యూజ్ చేస్తున్నారు.

హైదరాబాద్‌ కు చెందిన ఓ వ్యక్తి అయితే లాక్ డౌన్ పాస్‌ ను ఏకంగా అక్రమ సంబంధం కోసం ఉపయోగించుకున్నాడు. అతనో చిరు ఉద్యోగి. లాక్ డౌన్ పాస్‌ తో ఇంటికి వెళ్లకుండా మరో మహిళ ఇంటికి వెళ్లి అక్రమ సంబంధాన్ని కొనసాగించాడు. కూకట్‌ పల్లి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఫార్మా కంపెనీలకు మినహాయింపు ఉంది.

దీంతో అతను పాస్ తీసుకొని విధులకు హాజరవుతున్నాడు. అతను ఆఫీస్ ముగిశాక ప్రతిరోజు ఇంటికి వెళ్లడం లేదు. రెండు మూడు రోజులకోసారి మాత్రమే వెళ్తున్నాడు. భార్య ప్రశ్నించగా.. పోలీసులు అడ్డుకుంటున్నారని - దీంతో ఒక్కోరోజు ఇంటికి రాలేకపోతున్నానని చెప్పాడు. కానీ ఆ తర్వాత భర్త ప్రవర్తనపై భార్యకు అనుమానం వచ్చింది. ఆరా తీయగా మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని, ఇంటికి రాని రోజు అక్కడకు వెళ్తున్నాడని గుర్తించింది. షీ టీమ్స్‌ కు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి - తీవ్రంగా హెచ్చరించి పంపించారు.