Begin typing your search above and press return to search.
బంధాలకు ఎఫైర్ల బంధనాలు
By: Tupaki Desk | 24 Nov 2019 9:41 AM GMTభర్త ఆస్ట్రేలియాలో ఉంటే భార్య హైదరాబాద్ లో అక్రమ సంబంధం.. భర్త బెంగళూరు వెళితే ప్రియుడిని ఇంటికి రప్పించుకొని ఇంట్లోనే రాసలీలల దుకాణం పెట్టిన భార్య.. ఇలా సమాజంలో ఇప్పుడు విలువలు పడిపోతున్నాయి. మన చిన్నప్పుడు తాతలు, అమ్మమ్మల కాలంలో ఇలాంటి చాటుమాటు వ్యవహారాలు చేయాలంటే భయపడేవారు.. ఒకవేళ ఎవరైనా చేసినా తెలిస్తే అవమానాలు భరించలేక ఉసురు తీసుకునే వారు.. వారిని గ్రామస్థులు వెలివేసేవారు. మొత్తం ఏదో తప్పు చేస్తున్నామన్న భావన మునుపటి మనుషుల్లో ఉండేది. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ యుగంలో ఎఫైర్లు చాలా కామన్ అయిపోయాయి.
కాలం మారింది.. సమాజమూ దాంతోనే మారిపోతోంది. గ్రామాలు, పట్టణాలు తేడా లేదు.. ఖాళీగా ఉంటే కబ్జా చేయడమే.. అలా ఆడ, మగ తెరచాటు వ్యవహారాలు ఎన్నో సాగుతున్నాయి. స్మార్ట్ పోన్ తో పరిచయాలు, ప్రేమలు, తర్వాత చాటుమాటుగా అక్రమ సంబంధాలు కొనసాగుతున్నాయి.
భర్త/భార్య ఉన్నా పెళ్లైనా.. పిల్లలున్నా కానీ ఈ అక్రమ సంబంధాల విషయంలో భర్త/భార్యలు కట్టుదాటుతున్నారు. తమ సొంత సుఖం తప్పితే బంధాలు, భవబంధాలకు విలువ ఇవ్వడం లేదు. సమాజంలో జరుగుతున్న చాలా సంఘటనలు చూశాక మన కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమవుతోందన్న ఆందోళన నెలకొంది.
పెళ్లి అంటే ఒక నమ్మకం.. ప్రేమ.. అనురాగం.. కానీ ఇప్పుడా బంధానికి కూడా బీటలు వారుతోంది. భాగస్వామి నచ్చకపోయినా.. దూరంగా ఉంటున్నా వెంటనే నచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధాలు నెరిపేందుకు ఏమాత్రం సంకోచించడం లేదు. అదేదో పెద్ద తప్పు అన్నట్టుగా ఎవ్వరూ భావించడం లేదు. అసలు ఆ ఫీలింగే వారిలో లేదు. మారుతున్న సమాజ పోకడ మనుషులను మార్చేస్తోంది.కానీ నమ్మకం లేని విధంగా విచ్చలవిడిగా సాగుతున్న ఈ అసహజ శృంగార అక్రమ క్రీడ ఎప్పుడూ శుభ ముగింపునే ఇవ్వదు.. పర్యవసనాలు దారుణంగానే ఉంటాయి. పడిపోయిన విలువలు, కట్టుబాట్లు చూసి కృంగిపోవడం తప్పితే మనం ఇలాంటి విషయాలను మార్చలేమనే విషయాన్ని గుర్తిస్తే మంచిది.