Begin typing your search above and press return to search.

దేశ ప్ర‌జ‌ల్ని ఇబ్బందిపెట్టేవి ఆ మూడేన‌ట‌

By:  Tupaki Desk   |   29 Aug 2017 7:10 AM GMT
దేశ ప్ర‌జ‌ల్ని ఇబ్బందిపెట్టేవి ఆ మూడేన‌ట‌
X
దేశ ప్ర‌జ‌ల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న అంశాలేమిటి? కేంద్రానికి ప్ర‌జ‌లు చేసిన అత్య‌ధిక ఫిర్యాదులు ఏ అంశానికి సంబంధించిదన్న‌ది చూసిన‌ప్పుడు ఆస‌క్తిక‌ర అంశాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దేశ స‌మ‌స్య‌లుగా నిత్యం భావించే అంశాల‌కు భిన్న‌మైన ఫిర్యాదులు ప్ర‌జ‌లు చేసిన‌ట్లుగా తాజాగా విడుద‌లైన అధ్య‌య‌నం ఒక‌టి పేర్కొంది.

గోవ‌ధ‌.. పోర్న్ వెబ్ సైట్లు.. ఆన్ లైన్ షాపింగ్ మోసాలే దేశ ప్ర‌జ‌ల నుంచి ఎక్కువ‌గా ఫిర్యాదులు అందిన‌ట్లుగా చెబుతున్నారు. ప్ర‌జాస‌మ‌స్య‌లు.. పింఛ‌ను శాఖ‌కు చెందిన భార‌త నాణ్య‌తా మండ‌లి నిర్వ‌హించిన అధ్య‌య‌నం 2012 నుంచి 2016 మ‌ధ్య కాలంలో నిర్వ‌హించారు.

కేంద్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోని 20 శాఖ‌ల‌కు అందిన ఫిర్యాదుల‌పై తాజా నివేదిక‌ను సిద్దం చేశారు. ఇందులో ప్ర‌జ‌ల నుంచి అందిన ఫిర్యాదులు అత్య‌ధికం గోవ‌ధ‌.. పోర్న్ వెబ్ సైట్ల‌కు సంబంధించిన‌వేన‌ని చెబుతున్నారు. ఈ రెండింటి త‌ర్వాత మూడో స‌మ‌స్య‌గా ఆన్ లైన్ షాపింగ్‌ న‌కు సంబంధించిన అంశాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందిన‌ట్లుగా చెబుతున్నారు.

గోవ‌ధ‌.. జంతు ప‌రిర‌క్ష‌ణ‌లో క‌నీస సౌక‌ర్యాల లేమి కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంద‌ని ఆ శాఖ‌కు అందిన ఫిర్యాదులు చేసిన‌ట్లుగా చెబుతున్నారు. గోవ‌ధ‌.. పోర్న్ వెబ్ సైట్ల‌ను నిషేధించాలంటూ పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు కోరిన‌ట్లుగా తెలుస్తోంది. వీటి త‌ర్వాత 20 శాతం కేసులు ప‌ర్యావ‌ర‌ణ.. అట‌వీ.. వాతావ‌ర‌ణ మార్పుల మంత్రిత్వ శాఖ‌కు సంబంధించిన అంశాలు న‌మోదైన‌ట్లుగా తెలుస్తోంది.

ప‌రిశ్ర‌మ‌లు.. వాహ‌న కాలుష్యంపై 17 శాతం ఫిర్యాదులు.. అడ‌వుల న‌రికివేత‌.. వ్య‌ర్థాలు.. ప్లాస్టిక్ నిర్వ‌హ‌ణ‌పై 13 శాతం.. ఖ‌డ్గ మృగాల స్మ‌గ్లింగ్ పై 5 శాతం ఫిర్యాదులు కేంద్రానికి అందాయి. ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమిటంటే.. మార్చి 1 - 2015 నుంచి మార్చి 31 - 2016 మ‌ధ్య కాలంలో అత్య‌ధిక ఫిర్యాదులు అందిన‌ట్లుగా నివేదిక వెల్ల‌డించింది. ఈ ఏడాదిలో ఏకంగా 9,490 ఫిర్యాదులు అందిన‌ట్లుగా తాజా నివేదిక వెల్ల‌డించింది.