Begin typing your search above and press return to search.
బతికున్న మనిషిని 'చంపేశారు'.. న్యాయం చేయాలని వేడుకోలు..!
By: Tupaki Desk | 19 Dec 2022 9:30 AM GMTబ్రతికున్న మనిషి చంపాలన్న.. చనిపోయిన మనిషి బతికించాలన్నా అది ప్రభుత్వ అధికారులకే సాధ్యపడుతోంది. ఓ అధికారి చేసిన చిన్నపాటి నిర్లక్ష్యం బతికున్న మనిషిని రికార్డుల పరంగా చంపేసింది. దీంతో తాను బతికే ఉన్నానని దయచేసి తనను గుర్తించండి అంటూ ఓ వ్యక్తి కాళ్లు అరిగేలా అధికారులు చుట్టూ తిరుగుతున్నాడు.
అయినా అధికారులు మాత్రం అతడి సమస్యను పట్టించుకోకపోవడం శోచనీయంగా మారింది. ప్రభుత్వ వ్యవస్థ నిర్లక్ష్యానికి అద్దం పడుతున్న ఈ ఘటన ప్రధాని మోదీ సొంతం రాష్ట్రం గుజరాత్ లో వెలుగు చూడటం ఇంకా బాధాకరం. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
గుజరాత్ రాష్ట్రంలోని వడోదర జిల్లా రామ్ దేవ్ పీర్ లోని చలి ప్రాంతంలో రాజు భాయ్ చావ్డా తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రాజు భాయ్ చావ్డా బ్రతికుండగానే రికార్డుల్లో చనిపోయినట్లు నమోదైంది. దీంతో అతడికి ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ నిలిచిపోయాయి.
ఈ నేపథ్యంలోనే తాను బ్రతికే ఉన్నానని.. దయచేసి గుర్తించండి అంటూ అధికారులకు ఎన్నో సార్లు దరఖాస్తు పెట్టుకున్నాడు. అయినా వాటిని అధికారులు తిరస్కరిస్తున్నాడని రాజు భాయ్ వాపోతున్నాడు. అలాగే తాను ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లినా అధికారులు తన పేరు ఓటరు లిస్టులో లేదంటూ పంపించి వేస్తున్నారని చెబుతున్నాడు.
ఈ సమస్య కారణంగా తన పిల్లలు సైతం ఎంతో నష్టపోతున్నారని మనోవేదనకు గురవుతున్నాడు. అధికారుల తప్పిదంతో ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలకు తాను అనర్హుడిగా మారుతున్నానని వాపోయాడు. ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులు చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్న పట్టించుకోవడం లేదని ఆరోపించాడు ఇకనైనా తనకు ప్రభుత్వం న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.