Begin typing your search above and press return to search.
మోడీ జీ.. ఇప్పటికైనా కళ్లు తెరవండి.. లాక్‌డౌన్ పెట్టండి: నిప్పులు చెరిగిన ఐఎంఏ
By: Tupaki Desk | 9 May 2021 9:30 AM GMTదేశంలో కరోనా తీవ్రత నానాటికీ పెరిగిపోవడం.. రోజుకు వేల సంఖ్యలో కరోనా బాధితులు మృత్యువాత పడ డం.. లక్షల సంఖ్యలో ప్రజలకు పాజిటివ్ రావడం.. ఆసుపత్రులు నిండిపోవడం.. ఎక్కడ పడితే.. అక్కడ కేసులు పెరిగిపోవడం.. వంటి పరిణామాలపై భారత వైద్య మండలి(ఐఎంఏ) తీవ్రంగా స్పందించింది. కరోనా సెకండ్ వేవ్‌పై తాము అనేక హెచ్చరికలు చేసినా.. మోడీ సర్కారు పెడచెవిన పెట్టిందని.. అదే మేం చెప్పినప్పుడు స్పందించి ఉంటే. పరిస్థితి వేరేగా ఉండేదని.. ఇంత ఘోరం ఉండేది కాదని పేర్కొంటూ.. తాజాగా మోడీ సర్కారుకు ఐఎంఏ ఘాటు లేఖ రాసింది.
తోలుమందం.. తీవ్ర వ్యాఖ్యలు
మోడీ సర్కారును ఇప్పటి వరకు దేశంలో ఎవరూ అనని విధంగా ఐఎంఏ అత్యంత తీవ్ర వ్యాఖ్యలే చేసింది. `ఇది తోలుమందం సర్కారు` అని నిప్పులు చెరిగింది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను ఏమాత్రం పట్టించుకోకుండా తోలుమందం వ్యవహారంతో ముందుకు పోయిందని ఆరోపించింది. లాక్‌డౌన్ తప్పనిసరి అనే సూచనలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని విమర్శించింది. కేంద్ర ఆరోగ్య శాఖ ధోరణిని తప్పుబట్టింది. కేంద్రం నిర్లక్ష్యం ఫలితంగా ఇప్పుడు రోజుకు 4 లక్షల కేసులు నమోదవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. సెకండ్‌వేవ్ సంక్షోభం నుంచి బయటపడేందుకు, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇప్పటికైనా దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించాలని కోరింది.
లాక్‌డౌన్ తక్షణావసరం!
గత ఏడాది లాక్‌డౌన్ విధించిన కారణంగానే కరోనాను కొంతమేరకు అదుపు చేశామని పేర్కొన్న ఐఎంఏ.. తాజాగా రాసిన లేఖలో.. ఇప్పుడు తక్షణమే లాక్‌డౌన్ విధించి.. ప్రజలను రక్షించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. వైర్‌సను అదుపులోకి తేవాలంటే ప్రణాళికతో కూడిన లాక్‌డౌన్‌ను విధించాలని సూచిం చింది. తద్వారా వ్యాప్తిని నిరోధించడంతో పాటు వైద్య సిబ్బందికీ ఊపిరి పీల్చుకునే వీలు కలుగుతుందని పేర్కొంది. మరోవైపు రాష్ట్రాలు విడివిడిగా అమలు చేస్తున్న 10-15 రోజుల కట్టడి కాకుండా దేశవ్యాప్త లాక్‌డౌన్ అవసరమని పేర్కొంది. రాత్రి కర్ఫ్యూలతో పెద్దగా ఉపయోగం ఉండదని తెలిపింది.
ఇప్పుడున్న చర్యలు ఏమూలకు?
కరోనా వైరస్ విశ్వరూపం దాలుస్తున్న నేపథ్యంలో దేశంలో ఇప్పుడు తీసుకున్నచర్యలు ఏమూలకూ చాల వని ఐఎంఏ విస్పష్టంగా ప్రకటించింది. అదేసమయంలో కరోనా కేసులు, మరణాలను ఎందుకు దాచిపెడుతున్నారని ఐఎంఏ ప్రశ్నించింది. ఆర్టీపీసీఆర్‌లో ఫాల్స్ నెగెటివ్ రిపోర్టు వచ్చి.. సీటీ స్కాన్‌లో పాజిటివ్‌గా తేలిన కేసుల వివరాలను ఎందుకు వెల్లడించడం లేదని నిలదీసింది. ప్రజారోగ్య రంగానికి జీడీపీలో 8 శాతం మేర కేటాయింపులు జరపాలని లేఖలో సూచించింది. కరోనా కట్టడికి.. కంటైన్‌మెంట్ చర్యలు, టీకా, మందులు, సిబ్బంది కొరతను అధిగమించేందుకు వ్యూహాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని కోరింది. మరి మోడీ సర్కారు ఐఎంఏ సూచనలను ఏమేరకు పరిగణనలోకి తీసుకుంటుందో చూడాలి.