Begin typing your search above and press return to search.

పాక్ అణుస్థావ‌రంలో ప్ర‌మాదం ఎంత‌వ‌ర‌కు నిజం?

By:  Tupaki Desk   |   18 March 2019 5:09 AM GMT
పాక్ అణుస్థావ‌రంలో ప్ర‌మాదం ఎంత‌వ‌ర‌కు నిజం?
X
దాయాది పాక్ లో బాహ్యా ప్ర‌పంచానికి తెలీని ఒక భారీ ప్ర‌మాదం చోటు చేసుకుందా? ప్ర‌పంచాన్ని అంతో ఇంతో ప్ర‌భావితం చేసే ఈ ప్ర‌మాదం గురించి బ‌య‌ట‌కు తెలీకుండా దాయ‌గా.. ఒక ఆంగ్ల మీడియా సంస్థ త‌న తాజా క‌థ‌నంతో సంచ‌లనం సృష్టిస్తోంది. అణ్వాయుధాలు ఉన్న దేశాలు.. వాటిని భ‌ద్ర‌ప‌రిచే ప్రాంతాల విష‌యం చాలా జాగ్ర‌త్త‌గా ఉంటాయి. ఏ చిన్న తేడా వ‌చ్చినా జ‌రిగే న‌ష్టం భారీగాఉండ‌ట‌మే కాదు.. దాని ప్ర‌భావం ప్ర‌పంచ దేశాల మీద ఉంటుంది.

అయితే.. పిచ్చోడి చేతిలో రాయి మాదిరి పాక్ చేతిలో అణ్వాయుధాలు ఉండ‌టాన్ని ప‌లు ప్రాశ్చాత్య దేశాలు భావిస్తుంటాయి. ఈ భావ‌న నిజ‌మేన‌న్న‌ట్లుగా తాజా ఉదంతం ఉంద‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పాక్ లోని కీల‌క అణుస్థావ‌రంలో ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాల్ని ఆధారంగా చూపిస్తున్నారు.

అయితే.. ఈ విష‌యం ఎందుకు బ‌య‌ట‌కు వ‌చ్చింది? ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చింద‌న్న విష‌యాన్ని చూస్తే.. ఫిబ్ర‌వ‌రి 26 నిర్వ‌హించిన స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ త‌ర్వాత పాక్ అణుస్థావ‌రాల్లో ఏమైనా క‌ద‌లిక వ‌చ్చిందా? అన్న విష‌యాన్ని నిపుణులు లోతుగా ప‌రిశీలించారు. ఇందుకోసం ప‌లు ఉప‌గ్ర‌హ చిత్రాల్ని అధ్య‌య‌నం చేయ‌గా.. బ‌లోచిస్థాన్ ప‌రిధిలోని ఖుస్డార్ అణ్వాయుద కేంద్రంలోని చిత్రాలు తేడాగా క‌నిపించ‌టం గ‌మ‌నార్హం.

ఖుస్డార్ అణ్వాయుధ కేంద్రం వ‌ద్ద భ‌ద్ర‌త క‌ట్టుదిట్టంగా ఉంటుంది. ఇక్క‌డి నిర్మాణాల్ని చూస్తే.. అక్క‌డ క‌చ్ఛితంగా అణు వార్ హెడ్ ల‌ను భ‌ద్ర‌ప‌ర్చిన‌ట్లుగా చెబుతారు. దాదాపు 200 అణు వార్ హెడ్ల‌ను భ‌ద్ర‌ప‌రిచే సామ‌ర్థ్యంతో దీన్ని నిర్మించారు. అయితే.. అన్ని లేవ‌న్న మాట‌ను చెబుతుంటారు. ఇదిలా ఉంటే.. మార్చి 8న ఇక్క‌డి శాటిలైట్ చిత్రాల్ని చూసిన‌ప్పుడు 200 మీట‌ర్ల పొడ‌వు.. 100 మీట‌ర్ల వెడ‌ల్పుతో అగ్నిప్ర‌మాదం జ‌రిగిన‌ట్లుగా న‌ల్ల‌టి మ‌చ్చ ఒక‌టి క‌నిపించింది.

దీనికి కార‌ణం ఏమై ఉంటుంద‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. దీనికి స‌మాధానంగా నిపుణులు చెబుతున్న మాట ఏమిటంటే.. అణ్వాయుధాల్ని ప్ర‌యోగించేందుకు వాడే క్షిప‌ణి ఏదైనా ప్ర‌మాదానికి గురై ఉంటుంద‌న్న బావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. త‌న దేశంలో ఏం జ‌రిగినా గుట్టుగా ఉంచేసే పాక్ తీరును తాజాగా స‌ద‌రు ఇంగ్లిషు మీడియా త‌న తాజా క‌థ‌నంతో బ‌య‌ట‌పెట్టింది. ఒక‌వేళ స‌ద‌రు మీడియా సంస్థ అనుమానించిన‌ట్లు అణ్వ‌స్త్ర‌స్థావ‌రం వ‌ద్ద జ‌ర‌గ‌రానిది ఏదైనా జ‌రిగి ఉంటే మాత్రం అంత‌ర్జాతీయ స‌మాజం నుంచి తీవ్ర ఒత్తిళ్లు పాక్ కు ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.