Begin typing your search above and press return to search.

మ‌త గురువుల హ‌త్య‌... అమెరికాలో క‌ల‌క‌లం

By:  Tupaki Desk   |   14 Aug 2016 6:00 AM GMT
మ‌త గురువుల హ‌త్య‌... అమెరికాలో క‌ల‌క‌లం
X
న్యూయార్క్‌ లో ప‌ట్ట‌ప‌గ‌లు న‌ట్ట‌న‌డి వీధిలో తుపాకుల‌ మోత మోగింది! ఇద్ద‌రు మ‌త గురువుల‌పైకి గుర్తుతెలియ‌ని కొంద‌రు దుండ‌గులు కాల్పులు జ‌రిపారు. బిజీగా ఉండే న్యూయార్క్ న‌గ‌రంలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న ఇప్పుడు అమెరికాలో చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. స్థానిక స‌మ‌యం ప్ర‌కారం శ‌నివారం మ‌ధ్యాహ్నం ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఓజోన్ పార్క్ స‌మీపంలో అల్ ఫుర్ఖానా జ‌మా మ‌సీదు ఉంది. మ‌ధ్యాహ్నం ప్రార్థ‌న‌లు ముగియ‌గానే ఇద్ద‌రు మ‌తగురువులు మ‌సీదులోంచి బ‌య‌ట‌కి వ‌చ్చి ఇంటికి బ‌య‌లుదేరారు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో ఆ ఇద్ద‌రిపైనా గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు విచ‌క్ష‌ణా ర‌హితంగా తుపాకుల‌తో కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల‌లో ఇమామా్ మౌలానా అంకోజీ - తారా ఉద్దీన్‌ ల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. ఘ‌ట‌నా స్థలంలోనే అంకోజీ కాసేప‌టికే ప్రాణాలు విడిచారు. కానీ, తారా ఉద్దీన్ ప‌రిస్థితి విష‌య‌మంగా ఉండ‌టంతో ఆయ‌న్ని వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆయ‌న చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.

అయితే, ఈ హత్య‌లు మ‌త విద్వేషాల వ‌ల్ల జ‌రిగిన‌వే అని కొంత‌మంది వాదిస్తున్నారు. మ‌సీదు నుంచి బయ‌ట‌కి వ‌చ్చిన ఈ ఇద్ద‌రూ ఇస్లాం సంప్ర‌దాయ దుస్తుల్లో ఉన్నార‌నీ, వీరి దాడికి మ‌త విద్వేషాలే కార‌ణం అని పోలీసులు చెబుతున్నారు. దుండుగ‌ల కోసం పెద్ద ఎత్తున గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని పోలీసు అధికారులు వెల్ల‌డించారు. మ‌ర‌ణించిన‌వారిలో అంకోజీది బంగ్లాదేశ్‌. రెండేళ్ల కింద‌టే న్యూయార్క్ వ‌చ్చారు. ఈయ‌న అల్ ఫుర్ఖానా మ‌సీదు మౌలానా.

ఈ హ్య‌తోదంతం తెలిసిన వెంట‌నే కీన్స్ ప్రాంతంలో ఉంటున్న ముస్లింలు చాలామంది ఆందోళ‌న బాట ప‌ట్టారు. ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకుని - న్యాయం చేయాలంటూ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చూస్తూ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌కు దిగారు. ఇలా మ‌త గురువులు హ‌త్య‌కు గురికావ‌డానికి కార‌ణం రిప‌బ్లిక‌న్ అభ్య‌ర్థి డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్య‌లే కార‌ణ‌మ‌ని మండిప‌డ్డారు. అమెరికా ప్ర‌జ‌ల్లో ఇస్లామో ఫోబియాను ఆయ‌న పెంచి పోషిస్తున్నార‌నీ, ముస్లింలు అంటే ఒక‌ర‌క‌మైన భ‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి ట్రంప్ తీసుకెళ్తున్నార‌ని వారు విమ‌ర్శించారు. విద్వేషాల‌ను రెచ్చ‌గొట్టే విధంగా ట్రంప్ ప్ర‌సంగాలు ఉంటున్నాయంటూ ఆందోళ‌న‌కారులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.