Begin typing your search above and press return to search.
ప్రజల్లో ఇమ్యూనిటీ తగ్గుతోంది.. కరోనా సెకండ్‌వేవ్ తప్పదా?
By: Tupaki Desk | 30 Oct 2020 2:30 AM GMTకరోనా నుంచి బయటపడాలంటే మనముందున్న ఏకైన మార్గం ఇమ్యూనిటీని పెంచుకోవడం మాత్రమే. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవాళ్లకు కరోనా రావడం లేదు. ఒకవేళ వచ్చినా తగ్గిపోతున్నది. మనదేశ ప్రజలకు ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది అందువల్లే ఇక్కడ మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. కరోనాకు మందులు, వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడంతో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
ఆరోగ్యకరమై ఆహారం తీసుకోవడం, శారీరక వ్యాయామం చేయడంతో రోగనిరోధకశక్తిని పెంచుకోవచ్చు. అయితే తాజాగా నిర్వహించిన ఓ సర్వే ఆందోళనకు గురిచేస్తోంది.
బ్రిటీష్ ప్రజల్లో క్రమంగా ఇమ్యూనిటీ తగ్గుతూ వస్తుందని ఓ సర్వే తేల్చిచెప్పింది. కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరగుతున్న నేపథ్యంలో రోగ నిరోధక శక్తి కూడా ప్రజల్లో అదే శాతంలో లేదా అంతకన్నా ఎక్కువ మందిలో పెరగుతూ రావాలి. కానీ అందుకు విరుద్ధంగా తగ్గడం బ్రిటీష్ శాస్త్రవేత్తలకు అంతుపట్టకుండా ఉంది. కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీ బాడీస్‌కు సంబంధించి గత జూన్ నెలలో నిర్వహించిన పరీక్షల్లో బ్రిటన్ జనాభాలో ఆరు శాతం జనాభాలో యాంటీ బాడీస్ ఉన్నట్లు తేలింది. సెప్టెంబర్ నెల నాటికి యాంటీ బాడీస్ కలిగిన వారి సంఖ్య 4.4 శాతానికి పడిపోయిందని తేలింది. దేశంలోని మొత్తం జనాభాకుగాను దేశ నలుమూలల నుంచి 3,65,000 మంది శాంపిళ్లను సేకరించడం ద్వారా ‘రియాక్ట్ 2’ పేరిట పరిశోధకులు జరిపిన అధ్యయనంలో వెల్లడయింది.
కొన్ని సందర్భాల్లో ప్రజల్లో యాంటీ బాడీస్ పడి పోవడం సాధారణమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మెమోరీ సెల్స్‌గా పిలిచే బీ సెల్స్ పడి పోకూడదని, తాము జరిపిన పరిశోధనల్లో బీ సెల్స్ పడిపోయాయా లేదా అన్న అంశాన్ని పరిశోధించలేదని, ఈ కారణంగా యాండీ బాడీస్ పడి పోవడం పట్ల అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పరిశోధకులు భరోసా ఇస్తున్నారు. తొందరగా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.