Begin typing your search above and press return to search.
మీకు తెలుసా...శృంగారంతో ఇమ్యూనిటీ?
By: Tupaki Desk | 22 March 2021 4:39 AM GMTబిజీ లైఫ్, ఒత్తిడి జీవితం, ఉరుకుల పరుగుల వ్యవహారంలో పడి చాలా మంది శృంగారాన్ని మరిచిపోతున్నారు. పల్లె వాసుల జీవితం కొంత విభిన్నం కానీ.. పట్టణాల్లో ఉద్యోగాలు చేసుకొనే వాళ్లకు వారం మొత్తం ఆఫీసు ఒత్తిడి, హడావుడితోనే సరిపోతుంది. దీంతో వాళ్లు రెగ్యులర్‌గా శృంగారంలో పాల్గొనడం లేదు. ఇదే ఎంతో ప్రమాదకరమని వైద్యులు అంటున్నారు. రెగ్యులర్‌గా శృంగారం లో పాల్గొంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని గతంలోనే తెలిసింది.
అయితే తాజాగా మరో విషయం తెలిసింది. అదేమిటంటే రెగ్యులర్‌గా శృంగారంలో పాల్గొంటే ఇమ్యూనిటీ పెరుగుతుందట. ఈ విషయం శాస్త్రీయంగా రుజువైంది. అప్పుడప్పుడూ శృంగారంలో వాళ్లతో పోలిస్తే రెగ్యులర్‌గా సెక్స్‌లో పాల్గొనే వాళ్లకు ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది. ఎందకంటే వారానికి మూడుసార్లు శృంగారంలో పాల్గొనే జంటల లాలాజలంలో ఇమ్యునోగ్గోబ్యులిన్ ఏ.. అనే ఓ యాంటీ బాడీ ఉత్పత్తి అవుతుందట. దీంతో మన శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుందని తేలింది. ఇది రోగకారక క్రిములతో పోరాడి రక్షణ వ్యవస్థను కాపాడుతుందని పరిశోధకులు అంటున్నారు.
అంతేకాక శృంగారం చేసుకొనే టైంలో శరీరంలో ఎన్నో మేలు చేసే హార్మోన్స్ స్త్రీ పురుషులిద్దరిలో ఉత్పత్తి అవుతాయి. ఈ హార్మోన్స్ మానసిక, శారీరక ఆరోగ్యానికి సహకరిస్తాయి. ఒక వేళ మన శరీరంలో ఈ హార్మోన్స్ విడుదల కాకపోతే మానసిక, శారీరక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అమెరికా కు చెందిన శాస్త్రవేత్తలు గతంలోనే శాస్త్రీయంగా నిరూపించారు. తిండి, నిద్రతోపాటు శృంగారం కూడా అత్యవరసం అంటున్నారు పరిశోధకులు.
శృంగారం లో తక్కువ సార్లు పాల్గొంటే డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంది. శృంగారం తరచూ చేసే వారితో పోలిస్తే.. శృంగారం చేయని వాళ్లకు ఒత్తిడి తగ్గి శారీరకంగానూ, మానసికంగానూ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. రెగ్యులర్ గా శృంగారం చేసేవారికి బీపీ కూడా కంట్రోల్ లో ఉంటుంది. మెదడుకు చెందిన కణాలు కూడా ఎంతో చురగ్గా స్పందిస్తాయి. శృంగారం చేసుకొనే టైంలో శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఈ హార్మోన్‌తో మనిషిలో ఉత్సాహం రెట్టింపవుతుంది. దీంతో ఒత్తిడి కూడా దూరమవుతుంది.
శృంగారం సడెన్ గా మానేయొద్దు..!
వివిధ కారణాల వల్ల కొందరు ఉన్నట్టుండి శృంగారం మానేస్తారు. ఇది ఎంతో ప్రమాదకరమని వైద్యులు అంటున్నారు. దీనివల్ల జనానంగ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా శృంగారం దూరమైన స్త్రీలలో చిరాకు, ఉద్రేకం, కోపం కలుగుతాయట. ఇందుకు జననాంగాల్లో స్రవించే ద్రవాలు ఆగిపోవడమే అని పరిశోధనలు వెలువడ్డాయి. అంతేకాదు స్త్రీ జననాంగాల్లో స్రవాలు ఊరకపోతే యోనిలో ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆ జనానాంగాల్లో స్రవించే స్రవాల వల్ల యోనిలో బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా ఉంటుంది. శృంగారంతో పాటు చక్కటి నిద్ర, క్రమం తప్పకుండా చేసే వ్యాయామం వల్ల మనం ఆరోగ్యం గా ఉండొచ్చు.