Begin typing your search above and press return to search.
కరోనా తగ్గినా తిప్పలు తప్పట్లేదు.. వాటిపై తీవ్ర ప్రభావం
By: Tupaki Desk | 25 May 2022 11:30 PM GMTప్రపంచాన్ని అల్లాడించిన కరోనా మహమ్మారి.. సోకినప్పుడు ఎంత బాధ పెట్టిందో.. నయమైన తర్వాత అంతే ఇబ్బంది పెడుతోంది. వైరస్ నుంచి కోలుకున్న తర్వాత కూడా ఆ ప్రభావం చాలా రోజుల వరకు ఉంటోంది. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి ఎక్కువగా గుండెపై ప్రభావం చూపిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
లక్షల మంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్న కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న తర్వాత కూడా తిప్పలు తప్పడం లేదు. వైరస్ బారిన పడి రోజుల తరబడి ఇబ్బంది పడిన వారు.. హమ్మయ్య కోలుకున్నాం అనుకునేలోగానే దాని ప్రభావం చూపెడుతోంది. శరీరంలో ఏదో ఒక అవయవంపై సైడ్‌ఎఫెక్ట్‌ను చూపిస్తూ.. బాధితులను ఇబ్బంది పెడుతోంది.
కరోనా సోకి కోలుకున్న వారిలో ఎక్కువగా గుండె, ఊపిరితిత్తుల పై ప్రభావం పడుతున్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. స్కాట్లాండ్‌లోని ఇంటెన్సివ్ కేర్ రోగులపై చేసిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొవిడ్-19కి కారణమయ్యే సార్స్-కోవ్-2 వైరస్ గుండెలోని కుడివైపు భాగానికి ఇన్‌ఫెక్షన్ సోకడం ద్వారా దాని పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతోందని అధ్యయనంలో తేలింది.
10 ఐసీయూలలో తీవ్ర అనారోగ్యంతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న 121 మంది కరోనా బాధితులను పరీక్షించగా.. ముగ్గురిలో గుండె కుడివైపున.. ఊపిరితిత్తులకు రక్తాన్ని పంపింగ్ చేసే ప్రాంతంలో తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు.
కరోనా బాధితుల ప్రాణాలను కాపాడటమే కాకుండా ప్రాణాంతక గుండె, ఊపిరితిత్తుల సమస్యల సంరక్షణపై అధ్యయనం చేసినట్టు ఎన్‌హెచ్‌ఎస్ గోల్డెన్ జూబ్లీ స్కాట్లాండ్‌లోని గ్లాస్గో యూనివర్శిటీ పరిశోధకులు తెలిపారు.
కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నవారిలో భవిష్యత్‌లో వారిని వైరస్ బారి నుంచి రక్షించడమే లక్ష్యంగా అధ్యయనం కొనసాగుతుందని వెల్లడించారు.