Begin typing your search above and press return to search.

కరోనా వైరస్ ఎండ ఎక్కువగా ఉంటే చనిపోతుందా!

By:  Tupaki Desk   |   26 March 2020 11:30 PM GMT
కరోనా వైరస్ ఎండ ఎక్కువగా ఉంటే చనిపోతుందా!
X
కరోనా వైరస్ .. వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతుంటే కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుందని కొంతమంది వైద్య నిపుణులు భావిస్తున్నారు. కానీ, మరి కొంతమంది మాత్రం ఎండ తీవ్రతకు - కరోనా వైరస్ చావదు అని చెప్తున్నారు. సాధారణంగా అంటువ్యాధులు కాలంతో పాటు వస్తూ పోతుంటాయి. శీతాకాలంలో జలుబు - నోరో వైరస్ వలన వాంతులు అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే వేసవిలో టైఫాయిడ్ కేసులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇదే తరహాలో కోవిడ్-19 కేసులు కూడా తగ్గే అవకాశం ఉందా ?లేదా ?

గత ఏడాది డిసెంబర్ మధ్యలో చైనాలో తలెత్తిన ఈ వైరస్ క్రమంగా ప్రపంచ దేశాలకి - విస్తరించింది. దీనితో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పటివరకు సంభవించిన చాలా మహమ్మారులు ఉష్ణోగ్రతలు అతి తక్కువ ఉన్న ప్రాంతాలలో తలెత్తడంతో - పెరుగుతున్న ఉష్ణోగ్రతల వలన వైరస్ ప్రభావం తగ్గు ముఖం పట్టవచ్చేమో అని కొందరు భావిస్తున్నారు. అయితే, ఉష్ణోగ్రతలు పెరిగితే, కరోనా తగ్గుముఖం పడుతుంది అని అనుకోవడం పొరపాటే అని కొందరు హెచ్చరిస్తున్నారు.

కరోనా వైరస్ ప్రభావం కూడా కాలాలకు అనుగుణంగా మారవచ్చు. వైరస్ ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న తీరుని బట్టి చూస్తే దీని ప్రభావం శీతల దేశాలలో ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 500 ప్రదేశాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా జరిపిన ఒక అధ్యయనం కరోనా వ్యాప్తికి - వాతావరణంలో ఉన్న ఉష్ణోగ్రతలు - తేమ శాతం - గాలి వేగానికి సంబంధం ఉందని తెలిపింది. శీతల ప్రాంతాలలో కరోనావైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండవచ్చని మరొక అధ్యయనం పేర్కొంది. ఉష్ణ ప్రాంతాలలో ఈ వైరస్ ప్రభావం తక్కువగా ఉండవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అయితే, ఈ అధ్యయనాల పై ఇంకా ఒక స్పష్టమైన ప్రకటన అంటూ లేదు. సాధారణ వైరస్ ప్రభావం చూపే తీరుని - కరోనా ప్రభావం చూపే తీరుకు పోల్చడం సరైనది కాదు. ఎందుకంటే కరోనా వైరస్ ని ఎదుర్కోవటం ఇప్పుడు మానవాళి ముందున్న అతి పెద్ద సవాలు. కాబట్టి ఇలాంటి వందంతులు మాని ...ఇంట్లో నుండి బయటకి రాకుండా ఉండే కరోనా నుండి తప్పించుకోగలరు. ఎండ ఎక్కువగా ఉంది కదా అని వస్తే ..ఎవరైనా కూడా కరోనా బారిన పడాల్సిందే..