Begin typing your search above and press return to search.
ఆన్ లైన్ క్లాసులతో విద్యార్థులపై పెను ప్రభావం
By: Tupaki Desk | 12 July 2021 4:24 AM GMTకరోనా వైరస్ తో అన్నీ మారిపోయాయి. అన్నీ బంద్ అయిపోయాయి. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేని దుస్థితి ఏర్పడింది. దీంతో వారి భవిష్యత్ అంధకారంలో పడుతోంది. పాఠశాలలు ప్రత్యక్ష క్లాసులకు స్వస్తిపలికి ఆన్ లైన్ క్లాసులతో నెట్టుకొస్తున్నాయి. కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, టీవీ తెరల ముందు పాఠాలు వినడం వల్ల విద్యార్థులపై పెను ప్రభావం పడుతోందట.. ఇక చిన్న పిల్లల తలకు ఈ ఆన్ లైన్ పాఠాలు ఎక్కడం లేదు.
పిల్లలందరికీ వ్యాక్సిన్లు వేస్తే కానీ తిరిగి పాఠశాలలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. సంవత్సరన్నరగా పిల్లలు పూర్తిగా ఆన్ లైన్ చదువులకే అంకితమైపోయారు. ఇక ఆన్ లైన్ పాఠాలు విద్యార్థుల బుర్రకు ఎక్కడం లేదు. వారికి డౌట్లు వస్తే తీర్చే నాథుడే లేడు. దీంతో ఈ ఆన్ లైన్ చదువులు వారికి పెను శాపంగా మారుతున్నాయి.
విద్యాసంవత్సరం జూన్12న మొదలు కావాల్సి ఉన్నా నెల ఆలస్యంగా ఈ జులైలో ప్రారంభమైంది. అదీ ఆన్ లైన్ లోనే. అయితే ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉన్నంత సౌలభ్యం ప్రభుత్వ పాఠశాలల విషయంలో ఉండదు. ఎక్కువమంది గ్రామీణ విద్యార్థులే ఉంటారు కాబట్టి ప్రభుత్వ టీవీలు, చానెల్స్ ద్వారానే వీరి పాఠాలు వినగలుగుతారు. కేబుల్ టీవీ ఉంటే ఇదంతా సాధ్యం. లేని వారు, పేద విద్యార్థులు దీనికి దూరం కాక తప్పదు.
కరోనా వల్ల దాపురించిన ఈ ఆన్ లైన్ బోధనా విధానం ఇప్పటివరకు లేదు. పాఠశాల స్థాయిలో డిజిటల్ క్లాస్ రూంల ఏర్పాటు ఉందే తప్ప బోధన పూర్తిగా క్లాస్ రూంలకు దూరంగా ఎప్పుడూ జరగలేదు. దీంతో ఈ కొత్త విధానం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు శరాఘాతంగా మారింది.
ఆన్ లైన్ చదువులతో తెలివైన విద్యార్థులకు లాభం కలిగినా మామూలు విద్యార్థులకు పాఠాలు అర్థం కాక అన్యాయమైపోతారు. విద్యార్థుల్లో నిరుత్సాహం కలిగితే చాలా ప్రమాదం.. అందరినీ ఒకే గాటిన కట్టి చెప్పే ఈ భోధనతో ప్రమాదం.
కరోనా వల్ల ప్రజా జీవన విధానంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. విద్యార్థుల చదువుల్లోనూ ఆన్ లైన్ క్లాసులు వచ్చి గందరగోళం సృష్టిస్తున్నాయి. స్టూడెంట్స్ ఎక్కువగా స్మార్ట్ ఫోన్/ల్యాప్ టాప్ , కంప్యూటర్ల ముందు కూర్చోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు.
ముఖ్యంగా కంటిచూపుపై స్క్రీన్ల ప్రభావం ఎక్కువగా ఉంటోందన్నారు. దీనివల్ల భవిష్యత్ లో పిల్లలకు మయోపియా సమస్య రావచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.