Begin typing your search above and press return to search.
ఎక్కడో తేడా : జగన్ లో అసహనం ...?
By: Tupaki Desk | 22 July 2022 2:30 PM GMTఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి నల్లేరు మీద నడకలా వచ్చే ఎన్నికలు ఉండవు. ఈ సంగతి చెప్పడానికి ఏ సర్వేలు అవసరం లేదు. తీపి ఎక్కువైతే చేదు అన్నట్లుగా ఇప్పటిదాకా చూస్తే ఉప ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలతో సహా జరిగిన అన్ని ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. ఎటు చూసినా ఆ పార్టీ వారే ప్రతినిధులుగా ఉన్నారు. మరి ఇంత పెద్ద మొత్తంలో అధికార పార్టీని గెలిపించిన జనాలకు ఆశించినది జరగడంలేదన్న అసంతృప్తి పూర్తిగా ఉంది.
మరో వైపు వైసీపీ అధినాయకత్వం చూస్తే లక్షన్నర కోట్లకు పైగా నిధులను నేరుగా జనాల ఖాతాల్లో వేశాం కదా అని చెబుతోంది. అయితే గ్రౌండ్ లెవెల్ లో మాత్రం వాటి ఫలితాలు పెద్దగా కనిపించడంలేద్ని ఫీడ్ బ్యాక్ వస్తోంది. దీంతో ఎందుకిలా జరుగుతోంది అన్నదే హై కమాండ్ కి పట్టుకున్న వ్యధగా చెబుతున్నారు.
అనేక రకాలైన సర్వేలు నివేదికలు బట్టి అందుతున్న సమాచారం చూస్తే జనాల్లో అసంతృప్తి బాగా ఉందనే. దాంతో ఏం చేయాలో తెలియక వైసీపీ పెద్దలలో అసహనం పెరిగిపోతోంది అంటున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్ నిర్వహించిన వర్క్ షాప్ లో సైతం నూటికి 87 శాతం కుటుంబాలకు అన్ని రకాలుగా న్యాయం చేశామని సంక్షేమ పధకాలు అందరికీ అందిస్తున్నామని చెప్పుకొచ్చారు.
దీన్ని గ్రౌండ్ లెవెల్ లోకి తీసుకునిపోవాలని ఆయన కోరుతున్నారు. అయితే జనాల్లో ఉన్న భావన వేరుగా ఉంది. సంక్షేమ ఫలాలు అందరికీ దక్కడంలేదు, ఇచ్చిన వారు కూడా అనేక రకాలైన పన్నుల బాధతో ఉన్నారు. తమకు కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో లాగేసుకుంటున్నారు అని కూడా మధన పడుతున్నారు. అదే విధంగా నిత్యావసర ధరవరలు అన్నీ పెరిగిపోయాయని కూడా ఆవేదన చెందుతున్నారు.
ఇక అభివృద్ధి అన్నది మచ్చుకైనా లేకపోవడం కూడా క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం మీద కనిపిస్తున వ్యతిరేకతకు అద్దం పడుతోంది. ఇవన్నీ నిజాలుగా మారి సర్వేల రూపంలో తిరిగి హై కమాండ్ కి వచ్చి చేరుతున్నాయి. అయినా సరే ఇన్ని లక్షల కోట్లు ఏ సర్కార్ ఈ దేశంలో ఇచ్చింది, మనమే ఇచ్చాం కదా ఎందుకు జనాలు దాన్ని పట్టించుకోవడం లేదు అన్న చర్చ అయితే వైసీపీ పెద్దలలో ఉందిట. దీని మీదనే జగన్ కూడా తరచూ పార్టీ వర్గాలకు క్లాస్ తీసుకుంటూ ఒకింత అసహనానికి గురి అవుతున్నారని అంటున్నారు.
మరి చూడబోతే గట్టిగా రెండేళ్ళు కూడా లేదు. ఇప్పటికే వ్యతిరేకత పెరిగింది. అది ఎన్నికల నాటికి మరింతగా పెరిగే అవకాశాలే ఉన్నాయి. దాన్ని తగ్గించేందుకు వైసీపీ అధినాయకత్వం ఏం చేస్తుంది అన్నదే చూడాలని అంటున్నారు. ఏది ఏమైనా జగన్ లో మునుపటి ధీమా స్థానంలో ఎంతో కొంత అసహనం కనిపించడమే పార్టీలో చర్చగా ఉందిట.